పార్లమెంట్‌ పోలింగ్‌పై స్పెషల్ నజర్

తాండూరు రాజకీయం వికారాబాద్

పార్లమెంట్‌ పోలింగ్‌పై స్పెషల్ నజర్
– సమస్యాత్మక, అతిసమస్యాత్మక కేంద్రాలపై దృష్టి
– పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లకు మౌళిక సదుపాయాలు
– తాండూరు ఆర్డీఓ శ్రీనివాస్ రావు
– పోలీసులకు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి ఆదేశాలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : చేవేళ్ల పార్లమెంట్ ఎన్నికలపై పటిష్ట భద్రతా చర్యలు చేపట్టాలని తాండూరు నియోజకవర్గ సహాయ ఎన్నికల అధికారి, ఆర్డీఓ శ్రీనివాస్‌ రావు అన్నారు. శుక్రవారం తాండూరు ఆర్డీఓ కార్యాలయంలో తహసీల్దార్లు, సెక్టోరల్ అధికారులు, పోలీసు అధికారులతో పాటు ఎఫ్ఎసీ, ఎస్ఎస్ఆ బృందాలతో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆర్డీఓ శ్రీనివాస్ రావు మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ప్రతి పోలింగ్ కేంద్రాలలో భద్రత చర్యలు తీసుకోవాలన్నారు. సమస్యాత్మక, అతి సమస్యాత్మక కేంద్రాలలో నిఘా ఉంచాలన్నారు. కేంద్రాలలో ఓటర్లకు, కావాల్సిన సదుపాయాలు తాగునీరు, టెంట్లు, మరుగుదొడ్లు ఇతర సౌకర్యాలు కల్పించాలన్నారు.

అదేవిధంగా డీఎస్పీ బాలకృష్ణారెడ్డి మాట్లాడుతూ పోలింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన బందోబస్తు నిర్వహించాలన్నారు. పోలీసులు ఏమరుపాటు లేకుండా విధులు నిర్వహించాలన్నారు.

ఎఫ్ఎసీ ఎస్ఎస్టీ బృందాలు క్షేత్రస్థాయిలో సమన్వయంతో పనిచేయాలన్నారు. బృందాలు ప్రతి వాహనాలు తనిఖీ చేయాలన్నారు. అక్రమ మద్యం, డబ్బు. రవాణా జరుగకుండా చూడాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్లు తారాసింగ్, మునీరుద్దీన్, కిషన్, వెంకటేష్, సీఐలు సంతోష్ కుమార్, ఆశోక్, మండలాల సెక్టార్ అధికారులు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

హస్తంలో చేరిన హరిగౌడ్