ఏటీఎం కాదు ఏటీబీ..!

ఆరోగ్యం టెక్నాలజీ తెలంగాణ మహబూబ్ నగర్ రంగారెడ్డి లైఫ్-స్టైల్ వికారాబాద్ హైదరాబాద్

ఏటీఎం కాదు ఏటీబీ..!
– డబ్బులేస్తే బట్ట బ్యాగులు ఇచ్చే మిషన్
– అద్భుత ఆవిష్కరణ అన్న మంత్రి కేటీఆర్
హైదరాబాద్‌, దర్శిని ప్రతినిధి: ఇప్పటి వరకు డబ్బులు ఇచ్చే ఏటీఎంలను చూసుంటాం. ఏటీఎంలకు ఉన్న క్రేజ్‌త్‌ బిన్న మైన విధంగా ఏనీ టైం సేవలందించే వివిధ రూపాల ఆవిష్కరణలు చాల అరుదుగా కనిపిస్తుంటాయి. అలాంటిదే మన హైదరాబాద్‌లో ఆవిష్కరించారు. కాని అది ఏటీఎం కాదు.. ఏటీబీగా ఏర్పాటు చేశారు. అంటే ఏనీ టైం బ్యాగ్‌ అందించే మిషన్ అన్నమాట. ప్రస్తుతం ప్రపంచాన్ని పట్ట పీడిస్తోన్న సమస్యల్లో ప్లాస్టిక్‌ భూతం ఒకటి. ప్రభుత్వాలు స్వచ్ఛంద సంస్థలు ఎన్ని రకాల చర్యలు తీసుకుంటున్నా ప్లాస్టిక్‌ వినియోగం మాత్రం తగ్గడం లేదు. రోజురోజుకీ ప్లాస్టిక్‌ వినియోగం పెరుగుతోంది. దీంతో విపరీతంగా కాలుష్యం పెరిగిపోతోంది. దీనికి చెక్‌ పెట్టడానికే హైదరాబాద్‌ జీహెచ్ఎంసీ ఈ ఏటీబీ సరికొత్త మిషన్‌ను అందుబాటులోకి తెచ్చింది. కూకట్‌పల్లిలోని ఐడీపీఎల్‌ ప్రాంతంలో శనివారం ఈ మిషన్‌ను ప్రారంభించారు. భవిష్యత్తులో ఈ మిషిన్లను నగరమంతా ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నారు అధికారులు. ఈ ఏటీబీ మిషన్‌పై తెలంగాణ మంత్రి కేటీఆర్‌ స్పందించారు.. అద్భుతమైన ఆవిష్కరణ అంటూ ట్వీట్ చేశారు.

ఎలా పనిచేస్తుందంటే..?
ఏటీబీ (ఏనీ టైమ్‌ బ్యాగ్‌) పేరుతో మెవాటే, యునైటెడ్ వే ఆఫ్ హైదరాబాద్ సంస్థలతో కలిసి జీహెచ్ఎంసీ ఈ మిషన్‌ను ఏర్పాటు చేసింది. మీరు చూస్తున్న ఈ మిషన్‌ పనిచేయడానికి కరెంట్‌ కూడా అవసరం లేదు. సోలార్‌ ఎనర్జీ ద్వారానే పని చేస్తుంది. రూ. 10 చెల్లిస్తే సంచులను పొందొచ్చు. ఇందుకోసం మనం రూ. 10 నోటు లేదా రెండు ఐదు రూపాయలను బిల్లలను మిషన్‌లో వేసిన వెంటనే.. కింది నుంచి సంచి వస్తుంది. అంతేకాదండోయ్‌.. మిషన్‌పై ఉండే క్యూ ఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేసి యూపీఐ ద్వారా పేమెంట్‌ చేసి కూడా సంచిని తీసుకోవచ్చు. 500 సంచుల పట్టే సామర్థ్యం ఈ మిషన్‌ సొంతం.