వ‌చ్చే రెండేళ్ల వ‌ర‌కు అభివృద్ధి మాదే..!

తాండూరు రంగారెడ్డి రాజకీయం వికారాబాద్

వ‌చ్చే రెండేళ్ల వ‌ర‌కు అభివృద్ధి మాదే..!
– చెప్పలేని అభివృద్ధి చేస్తున్న సీఎం కేసీఆర్
– మంత్రి హరీష్ రావు టూర్ సక్సెస్ చేస్తాం

– ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : మంత్రిగా ఉన్న‌ప్పుడు మా హ‌యాంలో సాధించుకున్న అభివృద్ధి ప‌నులు వ‌చ్చే రెండేళ్ల వ‌ర‌కు జ‌రుగుతాయ‌ని ఉమ్మ‌డి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మ‌హేంద‌ర్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం తాండూరు పట్టణంలోని ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. శుక్రవారం తాండూరు పట్టణంలో రాష్ట్ర ఆర్థిక శాఖ, ఆరోగ్య‌శాఖ మంత్రి హ‌రీష్ రావు ప‌ర్య‌టిస్తున్నార‌ని చెప్పారు. ప‌ట్ట‌ణంలో మాతా శిశు ఆసుపత్రిలో షెడ్డు నిర్మాణం, సీసీ రోడ్డు పనులు, పాత తాండూరులో బస్తీ దవఖాన ప్రారంభోత్సవం, వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ ప్రారంభొ త్సవంతో పాటు తాండూరు మండలం జినుగుర్తిలోని కేజీబీవీలో అదనపు బ్లాక్ ప్రారంభోత్సవం, తిరిగి పట్టణంలో ఆశ వర్కర్లకు చీరల పంపిణీలో మంత్రి హరీష్ రావు పాల్గొంటారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ఏడేళ్ల పాలనలో సంక్షేమం, అభివృద్ధే ధ్యేయంగా కృషి చేస్తున్నారని అన్నారు. చెప్పిన చెప్పకపోయిన దళిత బంధు, 57 ఏండ్లకే ఆసరా ఫించన్, కళ్యాణలక్ష్మీ తదితర పథకాలను అమలు చేస్తున్నారని అన్నారు. అదేవిధంగా తాను మంత్రిగా ఉన్న సమయంలోనే దాదాపు రూ.2వేల కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందని, వచ్చే రెండేళ్ల వరకు అవే అభివృద్ధి పనులు కొనసాగుతాయని పేర్కొన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు అభివృద్ధి చేసే బాధ్యత తమపై ఉందన్నారు. మరోవైపు తాండూరుకు వస్తున్న మంత్రి హరీష్ రావు పర్యటనను సక్సెస్ చేసే విధంగా నేతలకు, కార్యకర్తలను ఆదేశించడం జరిగిందని చ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు కరణం పురుషోత్తంరావు, డీసీసీబీ జిల్లా డైరెక్టర్ రవీందర్ గౌడ్, టీఆర్ఎస్ పట్టణ మాజీ అధ్యక్షులు అబ్దుల్ రవూఫ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వడ్డె శ్రీనివాస్, మాజీ డీపీసీ సభ్యులు పట్లోళ్ల నర్సింలు, మాజీ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల రత్నమాల నర్సింలు, నాయకులు సాయిపూర్ బాల్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ జుబేర్ లాల, కౌన్సిలర్లు ప్రవీణ్ గౌడ్, వెంకన్నగౌడ్, రాము, బోయ రవి రాజు తదితరులు పాల్గొన్నారు.