ఎస్సీ వర్గీకరణతోనే అభ్యున్నతి

తాండూరు రాజకీయం వికారాబాద్

ఎస్సీ వర్గీకరణతోనే అభ్యున్నతి
– పార్లమెంట్ బిల్లును ఆమోదించాలి
– సమ్మెకు బీసీ సంఘం రాజ్ కుమార్ మద్దతు
తాండూరు రూరల్, ద‌ర్శిని ప్ర‌తినిధి : ఎస్సీ వర్గీకరణతో వారి ఉప కులాల అభ్యున్నతి సాధ్యపడుతుందని బీసీ సంక్షేమ సంఘం తాండూరు నియోజకవర్గ కన్వినర్ రాజ్ కుమార్ అన్నారు. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు ఎంఎస్ఎఫ్ వికారాబాద్ జిల్లా కన్వినర్ మల్లికార్జున్ మాదిగ ఆధ్వర్యంలో తాండూరు తహసీల్దార్ కార్యాలయం వద్ద చేపట్టిన నిరసన దీక్ష 5వ రోజుకు చేరుకుంది. శనివారం బీసీ సంఘం కన్వినర్ రాజ్ కుమార్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు యు.బుగ్గప్ప, కేవీపీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు ఉప్పలి మల్కయ్యతో కలిసి నిరసన దీక్షకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా రాజ్ కుమార్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ, బీసీ రిజర్వేషన్ల బిల్లులను ప్రవేశ పెట్టకుండా నిర్లక్ష్యం చేస్తుందని అన్నారు. ఎస్సీ వర్గీకరణ జరిగితే ఎస్సీ వర్గంలోని 58 ఉప కులాలు అన్ని రంగాలలో అభివృద్ధి సాధిస్తారని అన్నారు. కేంద్రం ఇప్పటికైనా ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే ఎస్సీ వర్గీకరణ, బీసీ రిజర్వేషన్ బిల్లులను ప్రవేశ పెట్టాలని డిమాండ్ చేశారు. ఇందుకోసం బీసీ సంఘం తరుపున పూర్తి మద్దతు తెలుపుతామని, వారి ఉద్యమానికి అండగా ఉంటామన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ యువజన సంఘం అధ్యక్షులు బొయ నరేష్, తాండూరు మండల బీసీ యువజన సంఘం అధ్యక్షులు బసంత్, నాయకులు చంద్రశేఖర్, రమేష్ టైలర్, ఎంఎస్ఎఫ్ నాయకులు స్వామిదాస్ మాదిగ, ప్రవీణ్ మాదిగ, శివాజీ, రావణ్, మహేందర్, రాఖేష్, నాని, గజేంద్ర, రవిచంద్ర, గోపాల్, రమేష్, శ్రీను తదితరులు పాల్గొన్నారు.