సెమిస్టర్ ఫలితాల్లో సింధూ డిగ్రీ విద్యార్థుల సత్తా

కెరీర్ తాండూరు వికారాబాద్

సెమిస్టర్ ఫలితాల్లో సింధూ డిగ్రీ విద్యార్థుల సత్తా
– యూనివర్సిటీ టాపర్ గా నిలిచిన విద్యార్థిని
– విద్యార్థులను అభినందించిన యజమాన్యం
తాండూరు, దర్శిని ప్రతినిధి : ఉస్మానియా యూనివర్సిటీ విడుదల చేసిన డిగ్రీ సెమిస్టర్ ఫలితాల్లో తాండూరు సింధు డిగ్రీ కళాశాల విద్యార్థులు సత్తా చాటారు. 6వ సెమిస్టర్ లో కళాశాలకు చెందిన విద్యార్థిని సౌజన్య (బీజెడ్సీ-థర్డ్ ఇయర్) 10/10 ఎస్‌జీపీఏ సాధించి యూనివర్సిటీ, తాండూరు టాపర్‌గా నిలిచింది. అదేవిధంగా నేహ ఫాతిమా(బీకాం-థర్డ్ ఇయర్) 9.67సీజీపీఏ, సోనియా ఆనమ్(బీజెడ్సీ-థర్డ్ ఇయర్) 9.67సీజీపీఏ, షజ్మీన్ బేగం(బీకాం-థర్డ్ ఇయర్) 9.56 సీజీపీఏ, సల్మా ఖానమ్ (బీఎస్సీ-ఎంపీసీఎస్ – థర్డ్ ఇయర్) 9.54సీజీపీఏ, ఈ. అక్షిత(బీకాం- థర్డ్ ఇయర్) 9.51 సీజీపీఏ, సానియా సిమ్రాన్(బీజెడ్సీ-థర్డ్ ఇయర్) 9.51 సీజీపీఏ, జె.అనిషా(బీజెడ్సీ-థర్డ్ ఇయర్) 9.41 సీజీపీఏ, జీ. భవాని(బీజెడ్సీ-థర్డ్ ఇయర్) 9.56ఎస్ జీపీఏ, ఎం.స్వాతి(బీఏ-థర్డ్ ఇయర్) 9.01 సీజీపీఏ, జే.స్వప్న (బీఏ-థర్డ్ ఇయర్) 9.0 సీజీపీఏలతో ఉత్తమ ఫలితాలను సాధించారు. ఈ సందర్భంగా కళాశాల వ్యవస్థాపకులు వి.రంగారావు, ప్రిన్సిపల్ విజయాదేవిలు విద్యార్థులను అభినందించారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.