కేసీఆర్ నాయకత్వంతోనే అభివృద్ధి.. సంక్షేమం
– సీఎం కేసీఆర్‌కు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంతోనే టీఆర్ఎస్ పార్టీ అభివద్ధి.. ప్రజా సంక్షేమం సాధ్యవుతుందని తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి అన్నారు. సోమవారం టీఆర్ఎస్ పార్టీ ద్విదశాబ్ది ఉత్సవం సందర్భంగా హైదరాబాద్‌లోని హైటెక్న్‌లో ఏర్పాటు చేసిన ప్లీనరీ సమావేశంలో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సమావేశంలో టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా సీఎం కేసీఆర్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడంపై ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి హర్షం వ్యక్తం చేస్తూ సీఎం కేసీఆర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాధన దిశాలి.. సంక్షేమ సారథిగా కేసీఆర్ సాధించిన ఎన్నో విషయాలతో మహా నాయకుడుగా ఉద్భవించారని అన్నారు. ఆయన నాయకత్వంలో పార్టీతో పాటు తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి.. ప్రజల సంక్షేమం జరుగుతోందని పేర్కొన్నారు.
