మార్కెట్ కమిటి ప్రతిష్ట పెంచేలా పనిచేయాలి
– కొత్త పాలకవర్గంతో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి
– ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపిన పాలకవర్గం
తాండూరు, దర్శిని ప్రతినిధి: మార్కెట్ కమిటి ప్రతిష్ట పెంచేలా కృషి చేయాలని తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి స్థానిక వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గంతో అన్నారు. తాండూరు మార్కెట్ కమిటి కొత్త చైర్ పర్సన్ గా వీణా శ్రీనివాస్ చారి, వైస్ చైర్మన్ గా పటేల్ ఉమాశంకర్, డైరెక్టర్లుగా ఉరెక్టర్లుగా హరిహరగౌడ్, షేక్ ఖాశిం అలీ, మ్యాతరి ప్రకాశం, కుర్వ భీమప్ప, యు. గోపాల్ రెడ్డి, ఎండీ ముస్తఫా, గోవింద్ నాయక్, వెంకటప్ప, మంత్రి వెంకటయ్య, జట్టిగాళ్ల శ్రీనివాస్, భాను ప్రసాద్, ప్రశాంత్ గౌడ్ లు నియామకం అయిన సంగతి తెలిసిందే. బుధవారం చైర్ పర్సన్ వీణ, వైస్ చైర్మన్ పటేల్ ఉమాశంకర్ తో పాటు డైరెక్టర్లు హైదరాబాద్ లో ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. తమకు అవకాశం కల్పించడం పట్ల ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి మాట్లాడూతూ రైతుల కోసం ప్రభుత్వం మార్కెట్ కమిటి ద్వారా భరోసా వంతమైన సేవలను అందిస్తోందని గుర్తుచేశారు. తాండూరు మార్కెట్ కమిటి ద్వారా రైతులకు, వ్యాపారులకు అందుబాటులో ఉండి ప్రతిష్టను పెంచేలా కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు అప్పూ (నయూం), యాలాల ఎంపీపీ బాలేశ్వర్ గుప్త, సీనియర్ నాయకులు శ్రీనివాస్ చారి, భద్రేశ్వరాలయ చైర్మన్ బంటారం సుధాకర్, రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్ రాంలింగా రెడ్డి, మహిళ కన్వినర్ శకుంతల, బీఆర్ఎస్ మండల పార్టీ ప్రధాన కార్యదర్శి రాకేష్ గౌడ్, జిల్లా కోఆప్షన్ సభ్యులు అక్బర్ బాబ, సాగర్ గౌడ్ తదితరులు ఉన్నారు.
ఇది కూడా చదవండి…

