అన్ని రంగాల్లో బీసీలు ముందుండాలి

తాండూరు రాజకీయం వికారాబాద్

అన్ని రంగాల్లో బీసీలు ముందుండాలి
– చట్టసభల్లో రిజర్వేషన్ల సాధ‌న‌కు పోరాడుదాం
– వికారాబాద్ జిల్లా గ్రంథాలయ చైర్మన్ రాజుగౌడ్
– రాజుగౌడ్, మధులతా శ్రీనివాసాచారిని సన్మానించిన రాజ్ కుమార్
తాండూరు, దర్శిని ప్రతినిధి : బీసీలు త‌మ హ‌క్కుల‌ను సాధించుకుని అన్ని రంగాల్లో ముందంజ‌లో ఉండాల‌ని వికారాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజుగౌడ్ అన్నారు. బీసీల సామాజిక అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని పెద్దేముల్ వైస్ ఎంపీపీ, బీసీ సంఘం జిల్లా మహిళ అధ్యక్షురాలు మధులతా శ్రీనివాస్ చారి అన్నారు. మంగళవారం బీసీ సంక్షేమ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు, తాండూరు కన్వినర్ కందుకూరి రాజ్ కుమార్ ఆధ్వర్యంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా నియామకమైన రాజుగౌడ్, బీసీ సంఘం జిల్లా అధ్యక్షురాలుగా నియామకమైన మధులతా శ్రీనివాస్ చారీలకు రాజ్ కుమార్ గ‌జ‌మాల‌తో ఘనంగా సన్మానం నిర్వహించారు. ఈ సందర్భంగా రాజుగౌడ్ మాట్లాడుతూ గత 25 ఏండ్లుగా పార్టీలతో పాటు బీసీల కోసం నిరంతరం కృషి చేయడం జరిగిందన్నారు. అందులో భాగంగానే గ్రంథాలయ చైర్మన్ పదవి వరించిందన్నారు. రాబోవు రోజుల్లో బీసీలు అంతా ఐక్యం కావాలన్నారు. చట్టసభల్లో రిజర్వేషన్ల సాధనే లక్ష్యంగా ఉద్యవి మంచాలన్నారు. మధులత శ్రీనివాస్ చారి మాట్లాడుతూ బీసీ మహిళల సాధికారతకు, అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని అన్నారు. అంతకుముందు జాతీయ కార్యవర్గ సభ్యులు రాజ్ కుమార్ మాట్లాడుతూ బీసీల సమస్యల పరిష్కారానికి రాజుగౌడ్ తోడ్పాటు అందించాలని కోరారు. ముఖ్యంగా తాండూరులో బీసీ సమీకృత భవన ఏర్పాటుకు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం రాష్ట్ర కార్యదర్శి సయ్యద్ షుకూర్, నియోజకవర్గ అధ్యక్షురాలు జ్యోతి, ప్రధాన కార్యదర్శి విజయలక్ష్మి, కార్యదర్శి మంజుల, యాలాల మండల అధ్యక్షులు లక్ష్మణ్ చారి, తాండూరు మండల యువజన సంఘం అధ్యక్షులు బసంత్ కుమార్, సభ్యులు భద్రు, భాస్కర్, వెంకట్ చారి, దుబాయ్ వెంకట్, శ్రీను, మహదేవ్, మతీన్, వివిధ కుల సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.