కాళికాదేవి వైభోగం..!

తాండూరు రాజకీయం వికారాబాద్

కాళికాదేవి వైభోగం..!
– శోభాయమానంగా, ఉత్సవ ఊరేగింపు
– అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి
– ఊరేగింపులో ఆకట్టుకున్న ప్రదర్శనలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలోని కాళికాదేవి జాతర ఉత్సవాలు వైభవంగా కొనసాగాయి. సోమవారం అమ్మవారి ఉత్సవ ఊరేగింపు శోభాయమానంగా నిర్వహించారు. ఆషాడ మాసం బోనాల ఉత్సవాలు రెండో రోజు ముగిశాయి. జాతర ముగింపు సందర్భంగా తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి అమ్మవారిని దర్శించుకున్నారు. అదేవిధంగా ఉత్సవాలలో భాగంగా సాయంత్రం అమ్మవారి ఉత్సవ ఊరేగింపు నిర్వహించారు. ఆలయం నుంచి ప్రారంభమైన ఊరేగింపు పుర ప్రధాన వీధుల గుండ కొనసాగింది. ఊరేగింపులో అమ్మవారి విగ్రహంతో పాటు ప్రత్యేకంగా ఊరేగించిన అమ్మవారి ప్రతిమ ఆకట్టుకున్నాయి. అంతేకాకుండా ఊరేగింపు ముందు పోతురాజుల విన్యాసాలు, కళాకారుల ప్రదర్శనలు కనువిందు చేశాయి.

అమ్మవారి జాతర ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన ఉత్సవ ఊరేగింపులో వికారాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజుగౌడ్, టీపీసీసీ ఉపాధ్యక్షులు ఎం.రమేష్ మహరాజ్, దేవాలయ చైర్మన్ ఆకుల రాములు, ఆలయ ఈఓ నరేందర్, నాయకులు పట్లోళ్ల నర్సింలు, నరేందర్ గౌడ్, కౌన్సిలర్ బంటారం లావణ్య, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు ప్రభాకర్ గౌడ్, బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్, ప్రజా ప్రతినిధులు, రాజకీయ, కుల సంఘాల ప్రతినిధులు, యువకులు పెద్ద ఎత్తున పాల్గొనగా.. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు.

ఇది కూడా చదవండి…

పాన్‌తో ఆధార్‌ లింకు చేయకుంటే అంతే..!

chaithany collage