ఆ రాశివారికి అంతా సంతోషమే
– ఈరోజు చేపట్టే పనులకు తిరుగుండదు
– ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే?
మేషం
మీ మనోధైర్యాన్ని నమ్ముకోండి.. అదే మిమ్మల్ని గెలిపిస్తుంది. కొన్ని పరిస్థితులు మిమ్మల్ని నిరుత్సాహపరుస్తాయి. కొన్ని వ్యవహారాలలో బుద్ధిచాంచల్యంతో వ్యవహరిస్తారు. చేపట్టిన పనులలో చిన్నపాటి సమస్యలు ఎదురైనా పూర్తిచేయగలుగుతారు.విష్ణు నామస్మరణ ఉత్తమం.
వృషభం
కీలక సమస్యను పరిష్కరించి శత్రువులపై విజయం సాధించగలుగుతారు. చేపట్టేపనుల్లో శ్రమపెరగకుండా చూసుకోవాలి. వృత్తి వ్యాపారాల్లో అనుకూల ఫలితాలున్నాయి. ఆర్థికంగా బాగుంటుంది. ఆపదలు తొలగడానికై వేంకటేశ్వరుణ్ణి పూజించాలి.
మిథునం
ఈ రోజు మీచుట్టూ సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. కుటుంబ సౌఖ్యం కలదు. దైవబలం విశేషంగా ఉన్నది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాలలో అభివృద్ధికి సంబందించిన శుభవార్త వింటారు. శ్రీవేంకటేశ్వర స్వామి సందర్శనం ఉత్తమం.
కర్కాటకం
ఈ మీ పనితీరు అందరికి ఆకట్టుకుంది. దీని ద్వారా అందరి మన్ననలు పొందుతారు. మరువలేని విజయాలు మీసొంతమవుతాయి. ఒక శుభవార్త ఆనందాన్నిస్తుంది. ఎక్కువ సమయాన్ని అభివృద్ధికై కేటాయించండి. శ్రీ దుర్గ ధ్యాన శ్లోక పఠనం మంచింది.
సింహం
ఈ రాశివారికి అంతా శుభమే జరుగుతుంది. మంచి శుభవార్తతో ఇళ్లంతా సంతోషంగా మారుతోంది. విందు, వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ బుద్ధిబలంతో కీలక వ్యవహారాలలో సమయస్పూర్తితో వ్యవహరించి అందరి ప్రశంసలను అందుకుంటారు. మీ ప్రతిభకు, పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. ఇష్టదైవారాధన మంచిది.
కన్యా
కొన్ని కీలకమైన ప్రణాళికలు వేస్తారు వాటిని ప్రారంభించడంలో చిన్నచిన్న ఆటంకాలను ఎదుర్కొంటారు. కీలక వ్యవహారాలలో దాపరికం లేకుండా స్పష్టంగా ఉండటమే మేలు. చేపట్టే పనుల్లో మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. వేంకటేశ్వర స్వామి సందర్శనం ఉత్తమం.
తుల
అన్నింట్లో ఆచితూచి వ్యవహరించారు. అన్నివిషయాల్లో సౌమ్యాన్ని ప్రదర్శించాలి. బంధుమిత్రులతో కొన్ని వ్యవహారాలలో దాపరికం లేకుండా స్పష్టంగా ఉండటమే మేలు. చేయని పనికి నింద భరించాల్సి వచ్చే అవకాశం ఉంది. శత్రువుల విషయంలో కాస్త అప్రమ్తత్తంగా ఉండాలి. చాలా వరకు మిశ్రమ ఫలితాలున్నాయి. ఇష్టదేవత స్తోత్రం పఠించడం మంచిది.
వృశ్చికం
వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాలలో మీకు అనుకూలమైన కీలక వార్తలు వినే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల సహాకారం లభిస్తుంది. దీంతో గొప్పకార్యాలు శుభఫలితాలున్నాయి. సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధిస్తే బాగుంటుంది.
ధనుస్సు
కుటుంబ వాతావరణం ఈ రాశివారికి అనుకూలిస్తుంది. ముఖ్యంగా ఆత్మీయుల సలహాలు తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. కొన్నాళ్లుగా ఇబ్బంది పెడుతున్న ఒక సమస్య పరిష్కారమవుతుంది. విష్ణుసహస్రనామం చదవడం లేదా వినడం చేస్తే మంచిది.
మకరం
పెద్దల దీవెనలు పొందడం చాల ముఖ్యం. వారి ఆశీర్వాదాలతో సానుకూల ఫలితాలు ఉంటాయి. కొన్ని కీలక వ్యవహారాలలో ఆలస్యం జరిగే సూచనలు ఉన్నాయి. శివ అష్టోత్తర శతనామావళి పారాయణ చేయడం మంచిది.
కుంభం
ఖర్చులు పెరిగే అవకాశం.. ఆచి తూచీ వ్యవహరించండి. ముఖ్యమైన విషయాలలో అనుకున్నది సాధిస్తారు. మంచి పనులు చేపడతారు. గొప్ప వారితో సత్సాంగత్యం ఏర్పడుతుంది. ప్రయాణ సమయాలలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఆంజనేయ ఆరాధన శుభప్రదం.
మీనం
ధర్మసిద్ధి మెండుగా ఉంటుంది. పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తవుతాయి. పెద్దలను కలవడం ద్వారా చాలా విషయాలు తెలుసుకుంటారు. వ్యవహార శైలితో ఎదుటివారిని ఆకట్టుకుంటారు. మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. మహాలక్ష్మి అష్టోత్తరం చదివితే మంచిది.

