వేగంగా రేల్వేస్టేషన్ సుందరీకరణ
– తాండూరు రైల్వేస్టేషన్‌ను సందర్శించిన డీఆర్ఎం ఏకే గుప్త
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు రైల్వేస్టేషన్‌లో సుందరీకరణ పనులను వేగంగా పూర్తి చేయాలని దక్షిణ మద్య రైల్వే శాఖ సికింద్రాబాద్ డిఆర్ఎం ఏకే గుప్త రైల్వే అధికారులతో అన్నారు. గురువారం తాండూరు రైల్వే స్టేసన్‌ను డీఆర్ఎం ఏకే గుప్త రైల్వే ఉన్నతాధికారులతో కలిసి సందర్శించారు. ఇక్కడ స్టేషన్ ప్రాంగణంతో పాటు టిక్కెట్ కౌంటర్,
వివిధ విభాగాలు, రైల్వే కాలనీ, రైల్వే పార్కులతో పాటు స్టేషన్ సమీపంలో కొనసాగుతున్న ట్రాక్ మరమ్మత్తుల పనులను పరిశీలించారు. ఆయా విభాగాల ఆధ్వర్యంలో కొనసాగుతున్న పనుల దశలపై ఆరా తీశారు. రైల్వే స్టేషన్‌లో కొనసాగుతున్న పనులను వేగవంతంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే నెల 23న దక్షిణ మద్య రైల్వే శాఖ జీఎం పర్యటన ఉంటుందని, ఇందులో భాగంగా
తాండూరు రైల్వేస్టేషన్‌ను సందర్శించి.. పరిశీలించడం జరిగిందని చెప్పారు. ఆయన వెంట తాండూరు రైల్వేస్టేషన్ మేనేజర్‌తో పాటు అధికారులు, సిబ్బంది ఉన్నారు.


