కొలెస్ట్రాల్‌కు చెక్ పెడదామిలా
– శరీరంలో నియంత్రణకు మార్గాలు
– అలా చేయడంలో ఆరోగ్యం సులువు
దర్శిని డెస్క్ : అనారోగ్య జీవన శైలికి శరీరంలోని కొలెస్ట్రాలే కారణమని చెప్పాల్సిన పనిలేదు. జీవనశైలిలో వస్తున్న మార్పులు, కొన్నిసార్లు జన్యుపరమైన కారణాల వల్ల ఈ సమస్య వచ్చే అవకాశం ఉంది. కొలెస్ట్రాల్ లైపోప్రొటీన్ల కలయికతో ఉంటుంది. కొలెస్ట్రాల్ రక్త నాళాల్లో పేరుకుపోవడం వల్ల రక్త ప్రసరణను నిరోధిస్తుంది. తగినంత స్థాయిలో కొలెస్ట్రాల్ స్థాయిలో లేకపోతే.. అంతకుమించితే.. గుండె జబ్బులు, మూత్రపిండాల సమస్యలు, గుండె పోటు వంటి సమస్యల ప్రమాదం పెరిగే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీంతో ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయిని నియంత్రించడానికి కొన్ని మర్గాల అలవాట్లు సాధ్యం చేస్తాయని చెబుతున్నారు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం.
ఆరోగ్యకరమైన బరువు
మనిషి ఆరోగ్యంగా ఉండడాన్ని కూడ శరీర బరువు నిర్ణయిస్తుంది. బరువు తగ్గడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. బరువు తగ్గడం వల్ల ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్ తగ్గుతుంది. మంచి కొలెస్ట్రాల్ అయిన హెచ్‌డిఎల్ పెరుగుతుంది.
వ్యాయామం తప్పనిసరి
కొలెస్ట్రాల్ నుంచి కాపాడుకోవాలంటే వ్యాయామం తప్పనిసరి. ఇది శరీరంలో సామర్థ్యాన్ని పెంచుతుంది. వ్యాయమాలు చేయడం ద్వారా కొలెస్ట్రాల్ స్థాయిని నియంత్రిస్తుంది. తేలికపాటి వ్యాయామాలు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. కొలెస్ట్రాల్ ప్రమాదం నుంచి కాపాడతాయి.
మోనోశాచురేటెడ్ ఫ్యాట్స్
ఆలివ్ ఆయిల్, కనోలా ఆయిల్, ట్రీ నట్స్, అవకాడోస్ వంటి మోనోఅన్ శాచురేటెడ్ కొవ్వులను తీసుకోవడం వల్ల ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్ స్థాయి తగ్గుతుంది, అదే సమయంలో హెచ్‌డిఎల్ కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది, ఇది కొలెస్ట్రాల్ స్థాయిలను నిర్వహించడానికి దోహదపడుతుంది.
ట్రాన్స్ ఫ్యాట్స్ నిర్వహణ
ట్రాన్స్ ఫ్యాట్ శరీరంలో ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది, అదే సమయంలో హెచ్‌డిఎల్ కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది, ఇది శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలకు పెంచే అవకాశం కూడా ఉంటుంది. ఇది ఆరోగ్యానికి ప్రమాదకరం. పై చిట్కాల ద్వారా శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయి బ్యాలెన్స్ చేసుకోవచ్చు.

