పేద‌ల ఆరోగ్యానికి సీఎంఆర్ఎఫ్ చేయూత‌

ఆరోగ్యం తాండూరు రాజకీయం వికారాబాద్

పేద‌ల ఆరోగ్యానికి సీఎంఆర్ఎఫ్ చేయూత‌
– టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు అఫ్పూ(నయూం)
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి : పేద‌ల కోసం స‌ర్కారు అమలు చేస్తున్న సీఎంఆర్ఎఫ్ పథకం వారి ఆరోగ్యాల‌కు చేయూత‌నందిస్తుంద‌ని టీఆర్ఎస్(వీఆర్ఎస్) తాండూరు పట్టణ అధ్యక్షులు అఫ్పూ(నయూం) అన్నారు. గురువారం తాండూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఆదేశాల మేరకు తాండూరు ప్రాంతానికి చెందిన 8 మంది లబ్దిదారులకు మంజూరైన రూ.2.50లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ ఎల్ఓసీలను అఫ్పూ త‌న చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎంఆర్ఎఫ్ పథకం ఎంతో మంది పేదల ఆరోగ్యానికి చేయూతనందించిందన్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న వైద్యం చేయించుకోలేని పేదలకు ఈ పథకం వరంగా మారిందన్నారు. పేదలు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ సంగీత ఠాకూర్, స్టేషన్ హనుమాన్ దేవాలయ చైర్మన్ సంజీవరావు తదితరులు ఉన్నారు.