సాహో డా. సంపత్ సార్..!

ఆరోగ్యం తాండూరు రాజకీయం వికారాబాద్

సాహో డా. సంపత్ సార్..!
– గర్భిణీ కోసం ఆసుపత్రికి వెళ్లి రక్తదానం
– ప్రసంశిస్తున్న తాండూరు వాసులు
తాండూరు, దర్శిని ప్రతినిధి: వైద్య వృత్తితో పాటు సామాజిక సేవలతో తాండూరు ప్రాంతంలో మనసున్న మహారాజుగా డాక్టర్ సంపత్ కుమార్ పేరు పొందారు. డాక్టర్ సంపత్‌ సార్‌ అంటే తెలియని వారు ఉండరు. మరోసారి డాక్టర్ సంపత్‌ సార్ చేసిన మంచి పనిని అందరు గుర్తుచేసుకుంటున్నారు. ఎందుకంటే తాండూరు పట్టణం ఇందిరానగర్‌కు చెందిన ఓ మహిళ గర్భిణీగా ఉంది. మంగళవారం కుటుంబ సభ్యులు ఆమెను జిల్లా ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ ఆమెకు ‘0’ నెగిటివ్ రక్తం అవసరమైంది. కుటుంబ సభ్యులు ఎక్కడా సంప్రదించినా ఫలితం కనిపించలేదు. చివరకు సామాజిక మాధ్యమాలలో విషయాన్ని వైరల్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న డాక్టర్ సంపత్ కుమార్ వెంటనే స్పందించారు. తమ ఆసుపత్రి నుంచి నేరుగా జిల్లా ప్రభుత్వానికి చేరుకున్నారు. అక్కడి వైద్య సిబ్బంది ద్వారా గర్భిణీ కోసం ‘0’ నెగిటివ్‌ రక్తం దానం చేశారు. గర్భిణీ ప్రాణాన్ని నిలిపిన డాక్టర్ సంపత్‌ సారును సాహో సంపత్‌ సార్ అంటూ తాండూరు వాసులు ప్రసంశించారు.