దసరా కప్ విజేతగా తాండూరు క్రికెట్ జోన్
– రెండో స్థానంలో నిలిచిన మాయబజార్ టీం
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలోని సెంట్ మార్క్స్ స్కూల్లో నిర్వహించిన దసరా క్రికెట్ కప్‌లో తాండూరు క్రికెట్ జోన్ టీం విజేతగా నిలిచింది. సహారా క్రికెట్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ టోర్నమెంట్‌లో మొత్తం ఆరు టీంలు పాల్గొన్నాయి. ఇందులో క్రికెట్ జోన్, మయాబజార్ టీంలు ఫైనల్‌లో తలపడ్డాయి. అత్యుత్తమ ప్రదర్శనతో క్రికెట్ జోన్ సత్తా చాటి దసరా కప్ విజేతగా నిలిచింది. రన్నరప్‌గా మయాబజార్ టీం నిలించింది. దసరా కప్‌లో మ్యాన్ ఆఫ్ ది సిరీస్‌గా యువరాజ్, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా శశివర్దన్, బెస్ట్ బ్యాట్ మెన్‌గా రోషన్, బెస్ట్ బౌలర్‌గా అజీజ్, బెస్ట్ ఉమెన్ క్రికెటర్‌గా కల్పన నిలిచారు. కప్‌ను సాధించిన టీంకు స్కూల్ ప్రిన్సిపల్ ఆనంద్ ట్రోపీ, ఇతర బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో కోచ్‌లు జగన్నాథ్ రెడ్డి, సతీష్, శరత్ సింగ్, హరీష్‌లు పాల్గొన్నారు.


