కీచక సర్పంచ్‌పై వేటు

క్రైం తాండూరు రాజకీయం వికారాబాద్

కీచక సర్పంచ్‌పై వేటు
– నంద్యానాయక్ సర్పంచ్‌ సస్పెండ్‌
– ఉత్తర్వులు జారీ చేసిన జిల్లా కలెక్టర్
తాండూరు, దర్శిని ప్రతినిధి: వికారాబాద్‌ జిల్లాలో సంచలనమైన బషీరాబాద్‌ మండలం నంద్యానాయక్ తాండా సర్పంచ్ శంకర్ రాథోడ్‌పై వేటు పడింది. గత 9 రోజుల క్రితం అదే తాండాకు చెందిన మతిస్థిమితం లేని బాలికపై సర్పంచ్ శంకర్ రాథోడ్ అత్యాచారాయత్నానికి పాల్పడిన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన జిల్లాలో కలకలం రేపింది. బాధితుల ఫిర్యాదు మేరకు సర్పంచ్‌పై కేసు నమోదు కావడంతో రిమాండుకు తరలించారు. పంచాయతీరాజ్ చట్టం ప్రకారం సర్పంచ్ శంకర్‌ రాథోడ్‌పై జిల్లా కలెక్టర్ కె.నిఖిల అతన్ని సస్పెండ్‌ చేస్తున్నట్లు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఆదేశాలను అమలు చేయాలని ఎంపీడీఓ, ఎంపీఓలను ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా సర్పంచ్ శంకర్ నాయక్ సస్పెన్షన్ వేటుకు గురైన నేపథ్యంలో తాండా ఉపసర్పంచ్ తాత్కాళిక సర్పంచ్‌గా కొనసాగుతారని ఉత్తర్వులలో స్పష్టం చేశారు.