దేవాలయాలపై గ్రహణ ఎఫెక్ట్..!

తాండూరు వికారాబాద్

దేవాలయాలపై గ్రహణ ఎఫెక్ట్..!
– తాండూరులో పలు దేవాలయల మూత
-సూర్యగ్రహణంతో దర్శనాలు రద్దు
తాండూరు, దర్శిని ప్రతినిధి : సుదీర్ఘ కాలం తరువాత ఏర్పడిన సూర్యగ్రహణ ప్రభావం దేవాలయాలపై పడింది. ఈ కారణంగా తాండూరు పట్టణంలో ప్రసిద్ధ దేవాలయాలు మూతపడ్డాయి. మంగళవారం సూర్యగ్రహణం సందర్భంగా పట్టణంలోని కాళికా దేవాలయం, భద్రేశ్వర దేవాలయం, స్టేషన్ హనుమాన్ దేవాలయం, సీతారాంపేట్ హనుమాన్ దేవాలయం, పోట్లీ మహారాజ్ దేవాలయం, నగరేశ్వర దేవాలయం తదితర దేవాలయాలను మూసివేశారు. గ్రహణం సందర్భంగా దేవాలయాల్లో పూజలు, భక్తులకు దర్శనాలను రద్దు చేశారు. అర్జిత సేవలను కూడ నిలిపి వేశారు. మంగళవారం రాత్రి దేవాలయాల సంప్రోక్షణ, శుద్ధి కార్యక్రమాలను నిర్వహించి బుధవారం ఉదయం నుంచి దేవాలయాలను తెరవడం జరుగుతుందని ఆయా దేవాలయాల అధికారులు ప్రకటించారు. బుధవారం ఉదయం నుంచి యధావిధిగా దర్శన, అర్జిత పూజా సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపారు.