వీఆర్వోలను తిరిగి విధుల్లోకి తీసుకోవాలి
– తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డికి వినతి
– ఇబ్బందుల పరిష్కారానికి కృషి చేస్తామని హామి
తాండూరు, దర్శిని ప్రతినిధి : ఇతర శాఖలకు బదిలీ చేసిన వీఆర్వోలను తిరిగి విధుల్లోకి తీసుకునేలా చూడాలని ఉద్యోగులు తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిని కోరారు. ఆదివారం తాండూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం అందజేశారు. గత ప్రభుత్వం వీఆర్వో వ్యవస్థను తొలగించి ఉద్యోగులను ఇతర శాఖలకు కేటాయించడం జరిగిందని గుర్తుచేశార
పాత వీఆర్వోలకు ఇంక్రిమెంట్లు ఇవ్వకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే వీఆర్వోలను తిరిగి విధుల్లోకి తీసుకుంటామని హామి ఇచ్చిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వీఆర్వోల సమస్యలను పరిష్కరించడంతో పాటు తిరిగి విధుల్లోకి తీసుకునేవిధంగా చూడాలని ఎమ్మెల్యేను కోరారు. ఇందుకు ఎమ్మెల్యే స్పందించి సమస్యలను అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావించి ప్రభుత్వం దృష్టి తీసుకెళతానని, పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని హామి ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల్లోని ఎక్స్ వీఆర్వోలు ఉన్నారు.
ఇదికూడా చదవండి…

