వారితో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి సంబంధం

తాండూరు రాజకీయం వికారాబాద్

వారితో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి సంబంధం
– స్వామిజీతో పూజలతోనే కార్యాచరణ
– పలు వ్యాపారాలకు నందకుమార్‌ మద్యవర్తిత్వం
– రోహిత్ రెడ్డి గురించి సంచనల వాఖ్యలు
– మీడియా సమావేశంలో మురళీకృష్ణ గౌడ్
తాండూరు, దర్శిని ప్రతినిధిః రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎమ్మెల్యేల కొనుగోలు కుట్రలో నిందుతులుగా ఆరోపిస్తున్న స్వామీజీ, నందకుమార్‌లతో తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌ రెడ్డికి సంబంధాలు ఉన్నాయని వికారాబాద్‌ జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ మురళీకృష్ణ గౌడ్ సంచలన వాఖ్యలు చేశారు. శుక్రవారం తాండూరు పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మురళీకృష్ణ గౌడ్ ఆసక్తికర విషయాలను వెల్లడించారు. పిరాయింపులు ఎర కుట్రలో నిందితులుగా పేర్కొంటున్నస్వామిజీతో పాటు మద్యవర్తి నందకుమార్తో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి సంబందాలు ఉన్నాయని తెలిపారు. స్వామిజీతో పూజలు నిర్వహించిన తరువాతే ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి మంచి కార్యమైనా.. చెడు కార్యమైనా ప్రారంభిస్తారని చెప్పుకొచ్చారు. ఇక మద్యవర్తి నందకుమార్తో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి వ్యాపార సంబంధాలు ఉన్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి, ఆయన తమ్ముడు రోహిత్ రెడ్డిలు చేపట్టిన మాణిక్ చంద్ పాన్ మసాల దందాలో నందకుమార్ మద్యవర్తిత్వం చేశారని తెలిపారు. పైకి మాణిక్ చంద్ అని పేరున్న దానిని సెవన్ హిల్స్ మాణిక్ చంద్ పేరుతో అక్రమ వ్యాపారం చేశారని, అది అవినీతి వ్యాపారం అని తెలిసి తప్పుకున్నట్లు వివరించారు. అంతకుముందు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి మోసాలకు మారుపేరు అయ్యారని.. తన వ్యాపార భాగస్వాములను, తాండూరు యువతను మోసం చేస్తున్నారని విమర్శించారు. అయితే పిరాయింపుల ఎర సంఘటనలో రోహిత్ రెడ్డి ప్రధానంగా ఉండడం సిగ్గుచేటు అనిపిస్తుందని అభిప్రాయపడ్డారు. ఇందులో ఆయన నిర్దోషిత్వాన్ని ప్రభుత్వం ద్వారా అయినా న్యాయస్థానం ద్వారా అయినా ప్రజల దృష్టికి తీసుకరావాలని కోరారు.