శివారు కాలనీలకు మిషన్ భగీరథ నీరు
– ఎన్టీఆర్ నగర్, రాజీవ్ కాలనీ, ఇందిరమ్మ కాలనీల్లో మౌళిక వసతులు
– సైడ్ డ్రెయిన్లు, సిసి రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు
– గల్లి గల్లికి ఎమ్మెల్యే పర్యటనలో ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మున్సిపల్ పరిధిలో విలీనమైన శివారు కాలనీలకు మిషన్ భగీరథ ద్వారా తాగునీరందస్తామని ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం గల్లి గల్లికి ఎమ్మెల్యే రెండో విడతలో భాగంగా ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి ఎన్టీఆర్ నగర్, రాజీవ్ కాలనీ, ఇందిరమ్మ కాలనీల్లో పర్యటించారు. ఆయా వార్డులో పర్యటించి స్థానికంగా నెలకొన్న సమస్యలను ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్టీఆర్ నగర్, రాజీవ్ కాలనీ, ఇందిరమ్మ కాలనీల్లో నెలకొన్న సమస్యలను విడతలవారీగా తీర్చడానికి ప్రయత్నం చేస్తానని అన్నారు. కాలనీల్లో మౌళిక వసతులతో పాటు సైడ్ డ్రైన్లు, సీసీ రోడ్ల నిర్మాణాలకు నిధులు మంజూరు చేస్తామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ సంస్థ ఛైర్మన్ మురళి కృష్ణ గౌడ్, మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ గుప్త, వైస్ చైర్ పర్సన్ దీపా నర్సింలు, మాజీ మున్సిపల్ చైర్మన్ విశ్వనాథ్ గౌడ్, ఫ్లోర్ లీడర్ శోబారాణి, కౌన్సిలర్లు నీరజ బాల్ రెడ్డి, అబ్దుల్ రజాక్, మంకాల్ రఘు, వెంకన్న గౌడ్, భీమ్ సింగ్, బోయ రవి, బాతుల మమత, కో ఆప్షన్ సభ్యుడు వెంకట్ రామ్ నాయక్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ వెంకట్ రెడ్డి, ఉర్దూ ఘర్ చైర్మన్ రజాక్, టిఆర్ఎస్ పార్టీ నాయకులు డాక్టర్ సంపత్, పట్లోళ్ల నర్సింలు, నయీం(అప్పూ), రాజు గౌడ్, శ్రీనివాస్ చారి, నర్సిరెడ్డి, హరీహరా గౌడ్, ఇర్షాద్, బాతూల వెంకటేష్, సంతోష్ గౌడ్, రాజన్ గౌడ్, రవి, యోగి, జావిద్ తదితరులు పాల్గొన్నారు.
