మరో మూడు రోజులు భారీ వర్షాలు

తెలంగాణ హైదరాబాద్

మరో మూడు రోజులు భారీ వర్షాలు
తెలంగాణ‌లో 18 జిల్లాల‌కు హెచ్చ‌రిక‌
ద‌ర్శిని ప్ర‌తినిధి : తెలుగు రాష్ట్రాలైన‌ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడం ఏర్పడడం ఈ వర్షాలకు ఊతమిచ్చింది, దీని ప్రభావంతో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. మరో రెండు రోజుల ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఇక తెలంగాణ‌లో మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి బలహీనపడడంతో శుక్రవారం తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉండగా.. మరో మూడు రోజులు పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్రంలోని 18 జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ శాఖ ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్, రాజన్నసిరిసిల్ల, జనగాం, సిద్దిపేట, మహబూబాబాద్, నాగర్ కర్నూల్ జిల్లాలలో భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని తెలిపింది.