రేపు క్షయ పరీక్షలు ఉచితం

ఆరోగ్యం తాండూరు వికారాబాద్

రేపు క్షయ పరీక్షలు ఉచితం
– బస్తీ దవఖానాలో అందుబాటు
– జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్ డా. రవీంద్ర యాదవ్
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు పట్టణ ప్రజలకు క్షయ వ్యాధి వికారాబాద్ జిల్లా ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ రవీంద్ర యాదవ్ గుడ్ న్యూస్ చెప్పారు. రేపు తాండూరు మున్సిపల్ పరిధిలో ఉచితంగా క్షయ(టీబీ) పరీక్షల కోసం శిబిరం నిర్వహిస్తున్నట్లు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. మంగళవారం తాండూరు మున్సిపల్ పరిధిలోని పాత తాండూరులో ఉన్న బస్తీ దవఖానలో ఈ ఉచిత క్షయ పరీక్ష శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. దగ్గు, దమ్ము, బరువు తగ్గడం, రాత్రిపూట జ్వరం, ఆయాసంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరికి ఎక్స్‌రే ద్వారా ఉచితంగా క్షయ పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని వివరించారు. ఈ ప్రత్యేక శిబిరాన్ని పట్టణ వాసులు సద్వనియోగం చేసుకోవాలని సూచించారు. బస్తీ దవఖానలో ఉదయం నుంచి ఉచిత పరీక్షల సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపారు.