బీజేపీని మరింత బలోపేతం చేయాలి

తాండూరు రాజకీయం వికారాబాద్

బీజేపీని మరింత బలోపేతం చేయాలి
– సభ్యత్వ నమోదు జయప్రదమే లక్ష్యం
– రాష్ట్ర కార్యవర్గ సభ్యులు యు.రమేష్ కుమార్
తాండూరు, దర్శిని ప్రతినిధి : బీజేపీని మరింత బలోపేతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలు కృషి చె యాలని ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు యు.రమేష్ కుమార్ అన్నారు. గురువారం తాండూరు పట్టణంలోని పార్టీ కార్యాలయంలో పట్టణ అధ్యక్షులు నాగారం మల్లేశం ఆధ్వర్యంలో బీజేపీ సభ్యత్వ(కార్యశాల) నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి యు.రమేష్ కుమార్ హాజరై మాట్లాడారు. దేశంలోని పేదల కోసం బీజేపీ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టిందన్నారు.

ఈ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి వివరించాలని అన్నారు. బీజేపీ సభ్యత్వంను విస్తృతంగా చేపట్టి పార్టీని మరింత బలోపేతం చేయాలన్నారు. పార్టీ సభ్యత్వ నమోదు లక్ష్యంగా పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణ ముదిరాజ్, కార్యదర్శి బంటారం భద్రేశ్వర్, అధికార ప్రతినిధి జుంటుపల్లి వెంకట్, కార్యవర్గ సభ్యులు సుదర్శన్ గౌడ్, కౌన్సిలర్ సాహు శ్రీలత లక్ష్మీకాంత్, పట్టణ కార్యదర్శులు కింరణ్ ముదిరాజ్, మిట్టి శ్రీనివాస్, ఉపాధ్యక్షులు దోమ కృష్ణ, మంతటి రాజు, చిదిరి ప్రకాష్, కార్యదర్శులు చందు, బిచ్చప్ప, బూత్ అధ్యక్షులు, ఇంచార్జులు తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

మందు బాబులపై కొరడా..!