నమో గణపతియే నమః ..!
– అయ్యప్ప స్వామి దేవాలయంలో హోమం
– ఆలయంలో మార్మోగిన నామస్మరణ
తాండూరు, దర్శిని ప్రతినిధి : నమో గణపతియే నమః అంటూ తాండూరు అయ్యప్ప స్వాములు మణికంఠునితో పాటు గణపతిని కీర్తించారు. బుధవారం పట్టణంలోని అయ్యప్ప స్వామి దేవాలయంలో గణపతి హోమం వైభవంగా జరిగింది. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో గణపతి హోమం సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఉదయం స్వామి వారికి సుప్రభాత సేవ. మహా హారతి, ఉదయం 6 గంటలకు ధ్వజారోహణ తరువాత శాస్త్రోత్తంగా గణపతి హోమం జరిపించారు. అనంతరం అయ్యప్ప పడిపూజ నిర్వహించారు. తాండూరుకు చెందిన శ్రీ సాయి చికెన్ సెంటర్ వ్యాపారి కుశలవ రెడ్డి సహకారంతో అయ్యప్ప స్వాములకు సద్ది ఏర్పాటు చేశారు. ఆలయంలో గణపతి హోమం, పడిపూజలతో ఆలయంలో అయ్యప్ప, వినాయక నామస్మరణతో మార్మోగింది. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటి సభ్యులు, అయ్యప్ప స్వాములు, పట్టణ ప్రముఖులు, భక్తులు పాల్గొన్నారు.

