20న ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి రాక
– రేపు ఘన స్వాగత సన్నహాక సమావేశం
– ప్రకటించిన పట్టణ అధ్యక్షులు అప్పూ(నయూం)
తాండూరు, దర్శిని ప్రతినిధి: దేశంలో సంచలనమైన ఎమ్మెల్యే కొనుగోలు కుట్రను బద్దలు కొట్టిన తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఈ నెల 20న సొంత నియోజకవర్గానికి విచ్చేస్తున్నారు. ఈ విషయాన్ని టీఆర్ఎస్ తాండూరు పట్టణ అధ్యక్షులు అప్పూ(నయూం) ప్రకటించారు. ఎమ్మెల్యే కొనుగోలు వ్యవహరం, మునుగోడు . ఎన్నికల ఫలితాల తరువాత మొదటి సారి తాండూరుకు విచ్చేస్తున్న ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి ఘన స్వాగతం పలకాలని పార్టీ శ్రేణులు నిర్ణయించారు. ఇందులో భాగంగా రేపు తాండూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పార్టీ ప్రజా ప్రతినిధుల సమక్షంలో తాండూరు పట్టణంతో పాటు నియోజకవర్గంలోని తాండూరు, పెద్దేముల్, యాలాల, బషీరాబాద్ మండలాల అధ్యక్ష, కార్యదర్శులు, అనుబంధ సంఘాల ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి వికారాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజుగౌడ్, మున్సిపల్ చైర్ పర్సన్, వైస్ చైర్ పర్సన్, కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, కోఆప్షన్ సభ్యులు, మాజీ ప్రజా ప్రతినిధులు పాల్గొంటారని పట్టణ అధ్యక్షులు అప్పూ(నయూం) తెలిపారు. కావున సమావేశానికి టీఆర్ఎస్ కమిటీ సభ్యులు, అనుబంధ సంఘాల నాయకులు, నాయకులు, కార్యకర్తలు హాజరై సమావేశాన్ని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు.

