వాహనదారులకు షాకింగ్ న్యూస్..!

కెరీర్ జాతీయం టెక్నాలజీ తెలంగాణ రాజకీయం వికారాబాద్ హైదరాబాద్

వాహనదారులకు షాకింగ్ న్యూస్..!
– చలాన్‌ల చెల్లింపు గడువు తగ్గింపు
– డ్రైవింగ్‌ రూల్స్‌లో కూడా మార్పులు
– కీలక సవరణలు చేసిన కేంద్రం
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : వాహనాలు నడిపే వారికి కేంద్రం షాకింగ్ న్యూస్ ఇచ్చింది. చలాన్‌ల చెల్లింపు, డ్రైవింగ్ రూల్స్‌లో మార్పులు తీసకవచ్చినట్లు ప్రకటించింది. కేంద్ర రవాణాశాఖ ఇటీవల సెంట్రల్‌ మోటార్ వెహికిల్స్ రూల్స్‌-1989 (Motor Vehicles Act, 1989) లో కీలక సవరణలను ప్రతిపాదించింది. ఈ మేరకు అమల్లోకి తెచ్చిన మార్పులు తెలిపింది. వాహనదారులలో ట్రాఫిక్‌ రూల్స్‌ పట్ల మరింత జాగ్రత్త, బాధ్యత పెంపొందించడం. ఇకపై చలాన్లపై నిర్లక్ష్యం ప్రదర్శించే వారిని కఠిన చర్యలు తీసుకోవడమే లక్ష్యంగా మార్పులు చేయడం జరిగిందని ప్రకటించింది.

ఇప్పటి వరకు 90 రోజులలో చలాన్లు చెల్లించాలి. కొత్త నిబంధనల ప్రకారం, ప్రతి చలాన్‌ను 45 రోజుల్లో చెల్లించాల్సి ఉంటుంది. చలాన్ చెల్లించకపోతే, పోలీసులకు ఆ వాహనాన్ని స్వాధీనం చేసుకునే అధికారం ఉంటుంది. చలాన్ల చెల్లింపు సకాలంలో జరగకపోతే, ఆ వాహనంపై అన్ని రవాణా లావాదేవీలు నిలిపివేయబడతాయి. అంటే, వాహనం అమ్మకం, కొనుగోలు, లైసెన్స్‌లో చిరునామా, పేరు మార్పు, రెన్యువల్‌ ఇలా ఏమీ జరగదు. అదేవిధంగా ఒక వాహనంపై ఐదు చలాన్లకు మించి ఉంటే, సంబంధిత అథార్టీ డ్రైవింగ్ లైసెన్స్‌ సస్పెండ్‌ చేయవచ్చు. ప్రస్తుతం చలాన్లు వాహన యజమాని పేరుతో మాత్రమే జారీ అవుతున్నాయి. అయితే కొత్త రూల్స్ ప్రకారం, వాహనం నడిపిన వ్యక్తి అసలు యజమాని కాకపోతే, డ్రైవింగ్ చేసిన వ్యక్తి బాధ్యుడిగా లెక్కింపబడతారు. నిబంధనలు ఉల్లంఘిస్తే, సంబంధిత అధికారులు మూడురోజుల్లో ఇలక్ట్రానిక్ నోటీసు, 15 రోజుల్లో ఫిజికల్‌ నోటీసును జారీ చేయాల్సి ఉంటుంది.
kvcs

మార్పులపై అభిప్రాయాలు తెలపొచ్చు..
కేంద్ర రవాణా శాఖ ప్రతిపాదించిన ముసాయిదా నిబంధనలపై అభ్యంతరాలు, సూచనలు ఉంటే రహదారి రవాణా మంత్రిత్వశాఖలోని అదనపు కార్యదర్శికి పంపవచ్చని కేంద్రం తెలిపింది. అదనంగా, ఈ-మెయిల్ ద్వారా కూడా అభ్యంతరాలను పంపవచ్చని సూచించింది.

ఇదికూడా చదవండి…

ప్రాణం తీసిన ఈత సరదా..!