నేల పూసిన పూలవనం..!

తాండూరు రాజకీయం వికారాబాద్

నేల పూసిన పూలవనం..!
– చెంగోల్‌లో వైభంగా బతుకమ్మ సంబరాలు
– హాజరైన ఎమ్మెల్యే సతీమణీ ఆర్తిరెడ్డి
– సందడిగా ఆడిపాడిన మహిళలు
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : తెలంగాణ సంస్కృతికి చిహ్నమైన బతుకమ్మ సంబరాలను తాండూరు మండలంలో ఘనంగా జరుపుకుంటున్నారు. శనివారం మండలంలోని చెంగోల్ గ్రామం పూలవనంగా మారింది. తీరొక్క పూలతో మహిళలు బతుకమ్మను అందంగా ముస్తాబు చేశారు. ఇంటింటి నుంచి బతుకమ్మలను తీసుకవచ్చిన మహిళలు పూజలు నిర్వహించారు.

ఈ వేడుకలకు తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి సతీమణి ఆర్తీరెడ్డి హాజరై సందడి చేశారు. గ్రామ సర్పంచ్ మళ్లీశ్వరీ గౌడ్, స్థానిక మహిళలతో కలిసి బతుకమ్మ ఆడి పాడారు. దీంతో గ్రామంలో బతుకమ్మ సంబరాల శోభ సంతరించుకుంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బతుకమ్మ పండగ తెలంగాణ సంప్రదాయానికి ప్రతీక అన్నారు. ప్రతి ఆడబిడ్డ బతుకమ్మ పండగను సంతోషంగా జరుపుకోవాలన్నారు. అనంతరం మహిళలు బతుకమ్మను నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ మహిళలు, పెద్దలు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి…

గుండెపోటుతో ఆర్టీసీ కండక్టర్ కన్నుమూత