కడుపులో నాణేల గని..!

ఆరోగ్యం జాతీయం హైదరాబాద్

కడుపులో నాణేల గని..!
– 157 కాయిన్స్‌ మింగిన వ్యక్తి
– ఆపరేషన్ ద్వారా తొలగించిన వైద్యులు
దర్శిని డెస్క్‌ : ఎవరైనా చిల్లర కాయిన్స్‌ గల్లా పెట్టేలో దాచుకుంటారు కాని.. ఇతనేంట్ర కడుపులో గనిలో దాగి ఉన్నట్లుగా దాచుకున్నాడని మీరే అంటారు. ఎందుకంటే ఆ వ్యక్తి కడుపులో 187 నాణేలు మింగాడు మరి. వైద్యులు ఆపరేషన్‌ చేసి ఆ నాణేలను తొలగించారు. ఎవ్వరు ఊహించనీ ఈ సంఘటన కర్ణాటకలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. కర్ణాటకలోని భాగల్ కోట్ జిల్లాకు చెందిన ఓ యువకుడు ఇటీవల వాంతులు, పొత్తికడుపులో నొప్పితో ఇబ్బంది పడుతున్నాడు. నొప్పి ఎంతకీ తగ్గకపోవడంతో కుటుంబ సభ్యులు హనగల్ లోని పెద్దాసుపత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అతడి పొట్టలో పెద్ద సంఖ్యలో నాణాలు ఉన్నాయని తేల్చారు. ఆపరేషన్ చేసి, రెండు గంటల పాటు కష్టపడి నాణాలన్నీ బయటకు తీశారు. ఇందులో 5 రూపాయల 56 నాణేలు, 2 రూపాయల 51 నాణేలు, 1 రూపాయి 80 నాణేలు బయటపడ్డాయి. వాటిని లెక్కించగా మొత్తం 187 నాణాలు ఉన్నాయని తేలింది. పొరపాటున ఒక్క నాణెం కడుపులోకి వెళితేనే ఇబ్బంది పడాల్సి వస్తుంది, అలాంటిది ఏకంగా 187 నాణాలు ఆ యువకుడి కడుపులోకి ఎలా వెళ్లాయని వైద్యులు ఆరా తీశారు. అతనికి పికా మానసిక జబ్బు ఉన్నట్లు.. అది ఒక తిండికి వ్యాధి అని తెలిపారు. దీంతో బాధపడుతున్నవారు తినే పదార్థాలు కాకుండా గడ్డి, బొమ్మలు, సుద్దముక్కలు, ఇతర గట్టి పదార్థాలను తింటుంటారన్నారు. ఈ మానసిక సమస్యతో వ్యక్తి నాణేలను తిన్నాడని వివరించారు.