111 జీఓపై సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
– త్వరలో ఎత్తివేసేందుకు చర్యలు అంటూ ప్రకటన
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : అసెంబ్లీ వేధికగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ 111 జీఓపై సంచలన వ్యాఖ్యలు చేశారు. వీలైనంత తర్వరలో జీవో 111 ఎత్తివేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. మంగళవారం ద్రవ్య వినియమ బిల్లుపై చర్చ సందర్భంగా పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు సీఎం సమాధానాలిచ్చారు. గతంలో ఎక్స్‌పర్ట్ కమిటి నివేధిక నిర్ణయం మేరకు 111 జీఓ తీసుకవచ్చామన్నారు. ప్రస్తుతం 111 జీవో అర్థ రహితం, రిడెండెంట్ కూడా అయిపోయిందన్నారు. 1.32 లక్షల ఎకరాలకు సంబంధించిన జీవోను ఎత్తివేస్తే ప్రభావితం అయ్యే అవకాశం ఉంటుందన్నారు. చీఫ్ సెక్రెటరీకిని, హెచ్‌ఎండీఏను రెక్వెస్ట్ చేశాం. మున్సిపల్ డిపార్ట్‌మెంట్ వాళ్లను చూస్తున్నారని తెలిపారు. అక్కడ కూడా కఠినంగా గ్రీన్ జోన్, మాస్టర్ ప్లాన్, రోడ్స్.. జీహెచ్‌ఎంసీ ఎలా అయితే ఉందో.. అదే పద్ధతిలో కొనసాగే విధంగా చర్యలు వీలైనంత త్వరలో జీవో 111ను ఎత్తి వేస్తామని ప్రకటించారు. అంతకుముందు చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య 111 జీవోను ఎత్తివేయాలని సీఎంను కోరారు.

