ట్రాన్స్‌ జెండర్ల జాతీయ గుర్తింపుకు అవకాశం

కెరీర్ తాండూరు వికారాబాద్

ట్రాన్స్‌ జెండర్ల జాతీయ గుర్తింపుకు అవకాశం
– అర్హులు దరఖాస్తు చేసుకోవాలి
– జిల్లా సంక్షేమ శాఖ అధికారి కె.లలిత
వికారాబాద్, దర్శినిప్రతినిధి: సమాజంలోని ట్రాన్స్‌ జెండర్లు జాతీయ గుర్తింపు పొందేందుకు అవకాశం కల్పించడం జరుగుతుందని, ఇందుకు అర్హులైన ట్రాన్స్‌ జెండర్లు దరఖాస్తు చేసుకోవాలని వికారాబాద్ జిల్లా మహిళ శిశు దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ అధికారి కేతావత్ లలిత తెలిపారు. శనివారం ఆమె తన కార్యాలయంలో మాట్లాడుతూ… ట్రాన్స్‌జెండర్లకు ఆర్థికపరమైన, సంక్షేమ పరంగా అవకాశాలను అందించేందుకు జాతీయ స్థాయి గుర్తింపు అవసరమన్నారు. కావున జిల్లాలోని ట్రాంజెండర్లు జాతీయ గుర్తింపు పత్రానికి దరఖాస్తు చేసుకోవాలన్నారు. గతంలో దరఖాస్తు చేసిన పత్రం కలిగి ఉన్నవారు తదుపరి పునరావాస పథకం కోసం దరఖాస్తులు కూడా ఆన్ లైన్ లో సమర్పించాలని అన్నారు. అర్హులైన ట్రాన్స్‌ జెండర్లు తమ దరఖాస్తులను htpp//transgender dosje. gov. India వెబ్ సైట్ లో సమర్పించాలని సూచించారు. పూర్తి వివరాల కోసం కలెక్టరేట్ లోని మహిళా శిశు దివ్యాంగుల మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ కార్యాలయంలో సంప్రదించవచ్చని పేర్కొన్నారు.