
పరీక్షా హాల్లోకి వచ్చిన పాము..!
– ఎంటర్ అయిన విద్యార్థులకు షాక్
– ఆ తరువాత ఏం జరిగిందంటే..?
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలో ఇంటర్ మీడియట్ సెకండ్ ఇయర్ పరీక్షలు గురువారం ప్రారంభమయ్యాయి. ఎంతో ఉత్సహాంగా పరీక్షా హాల్‌లోకి వెళ్లిన విద్యార్థులు షాక్‌కు గురయ్యారు. పరీక్షా హాల్లోకి వెళ్లగానే పామును చూసి కేకలు వేశారు. ఈ సంఘటన తాండూరు పట్టణం ప్రభుత్వ జూనియర్ కళాశాల పరీక్షా కేంద్రంలో జరిగింది. కాలేజీలోని ఏ బ్లాక్ రూం నెంబర్ 3లో విద్యార్థులు పరీక్షా రాసేందుకు వెళ్లారు. వెళ్లగానే ఓ మూలన పాము కనిపించింది. వెంటనే కేకలు వేస్తూ బయటకు పరుగులు తీశారు. వెంటనే అక్కడే ఉన్న సిబ్బంది వచ్చి పామును గమనించారు. కర్రతో పామును కొట్టి చంపేశారు. ఈ సంఘటనతో విద్యార్థులు ఆందోళనకు గురయ్యారు.

ఇదికూడా చదవండి…

