గ్రాండ్‌గా ఇందూరు ఐపీఎల్..!
– టాస్ వేసి టోర్నమెంట్ ప్రారంభించిన రాజ్ కుమార్
– గ్రామీణ యువతను హెచ్‌సీఏ ప్రోత్సహించాలని ఆకాంక్ష
– ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ను తలపిస్తుందని కితాబు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు నియోజకవర్గం పెద్దేముల్ మండలం ఇందూరు గ్రామంలో ఐపీఎల్(ఇందూరు ప్రిమియర్ లీగ్)టోర్నమెంట్ గ్రాండ్‌గా ప్రారంభమయ్యింది. మంగళవారం ఇందూరులో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్ హాజరయ్యారు. ఆయన చేతుల మీదుగా టాస్ వేసి టోర్నమెంట్‌ను ప్రారంభించారు. టోర్నమెంట్లో పాల్గొన్న క్రీడాకారులకు కరచాలనం చేసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇందూరులో ఏర్పాటు చేసిన ప్రిమియర్ లీగ్ టోర్నమెంట్ ఇండియన్ ప్రిమియర్ లీగ్‌ను తలపిస్తుందన్నారు. ఇంత గ్రాండ్‌గా ఏర్పాటు చేసిన నిర్వహకులను అభినందించారు.
మారుమాల ప్రాంతంలో పెద్ద ఎత్తున టోర్నమెంట్ ఏర్పాటు చేయడం గర్వకారణమన్నారు. యువతకు ఆదర్శంగా నిలుస్తుంది అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో యువకులు మతాలకు పార్టీలకు సంబంధం లేకుండా ఉత్సాహంగా ఐపీఎల్ లో పాలు పంచుకోవడం సంతోషాన్నిస్తుందన్నారు. అదేవిధంగా గ్రామీణ క్రీడాకారులను ముఖ్యంగా క్రికెట్లో యువకులను ప్రోత్సహించే విధంగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ) ఈ ప్రాంత క్రీడాకారులు కూడా ప్రోత్సహించాలని ఆకాంక్షించారు. దీంతో పాటు ప్రభుత్వం కూడా ప్రతి గ్రామంలో క్రీడా ప్రాంగణం ఏర్పాటుకు కృషి చేయాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఐపీఎల్ నిర్వాహకులు వెంకట్, బాలు, యాదవ్, చంటి, మహేష్, నవీన్, గ్రామ పెద్దలు బద్దప్ప, నరసింహులు, సన్‌రైజర్స్ ఇందూర్, ఆర్సబిఎస్ ఇందూర్, రాయల్ వారియర్స్, ఇండోర్ ఇందూర్, ఎస్ఎస్ బ్రదర్స్ ఇందూర్, అప్పి ఆటో కింగ్స్ ఇందూర్ జట్ల సభ్యులు, బీసీ సంఘం యువ నాయకులు రాము ముదిరాజ్, గిరిజపురం రమేష్, దుబాయ్ వెంకట్, అశోక్, హరి, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి….

