కానిస్టేబుల్‌పై సస్పెన్షన్ వేటు
– మహిళతో అసభ్య ప్రవర్తనపై చర్యలు
– ప్రకటించిన జిల్లా ఎస్పీ కోటిరెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి: వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణ పోలీస్టేషన్‌లో కానిస్టేబుల్‌పై సస్పెన్షన్ వేటు పడింది. వికారాబాద్ జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. తాండూరు పట్టణ పోలీస్టేషన్‌లో రాఘవేందర్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. అయితే ఇటీవల అతను ఓ మహిళతో అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు లైంగిక వేధింపులకు పాల్పడినట్లు బాధితురాలు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు డీఎస్పీ శేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో దర్యాప్తు జరిపారు.. ఇందులో ఆరోపణలు ఎదుర్కొన్న రాఘవేందర్ పై సస్పెండ్ వేటు వేసినట్లు జిల్లా ఎస్పీ కోటిరెడ్డి ప్రకటనలో వెల్లడించారు.

