కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటు చేయించండి

తాండూరు రాజకీయం వికారాబాద్

కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటు చేయించండి
– వెక్కిరిస్తున్న ఖాళీలను భర్తి చేయండి
– జిల్లా కలెక్టర్‌తో తాండూరు బీజేపీ నేతలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మున్సిపల్ పాలనను గాడిలో పెట్టేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని తాండూరు బీజేపీ నేతలు కోరారు. గురువారం బీజేపీ ఫ్లోర్ లీడర్ అంతారం లలిత ఆధ్వర్యంలో కౌన్సిలర్లు జిల్లా కలెక్టర్‌ ప్రతీక్ జైన్‌ను కలిశారు. గత ఐదు నెలలుగా మున్సిపల్‌లో కౌన్సిల్ సమావేశం నిర్వహించలేదని కలెక్టర్ దృష్టికి తీసుకవచ్చారు. ఫలితంగా ప్రజా సమస్యలు గాలిదీపంలా మారాయన్నారు.

అభివృద్ధి సమస్యలు కూడ తీరడం లేదని తెలిపారు. అదేవిధంగా మున్సిపల్‌లో ఉద్యోగుల ఖాళీలు వెక్కిరిస్తున్నాయని అన్నారు. డీఈ, శానిటరీ ఇనుస్పెక్టర్, ఆర్ఐ, బీఐ పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. పై సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్‌కు వినతిపత్రం ద్వారా కోరారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు సాహు శ్రీలత, బంటారం లావణ్య, బాలప్ప, నాయకులు తదితరులు ఉన్నారు.

ఇదికూడా చదవండి…

గుట్కా స్థావరంపై దాడి