కుంగిపోయిన నాలా..!

క్రైం తెలంగాణ రాజకీయం హైదరాబాద్

కుంగిపోయిన నాలా..!
– గోషామహాల్‌లో ప్రమాదం
– కార్లు, ఆటోలు, బైకులు ధ్వంసం
హైదరాబాద్‌, దర్శిని ప్రతినిధి: హైదాబాద్‌లోని ప్రసిద్ద గోషామహల్‌ చాక్రవాడలో భారీ నాలా అకస్మాత్తుగా కుంగిపోయింది. శుక్రవారం బస్తీలో మార్కెట్‌ను ఏర్పాటు చేశారు. దీంతో స్థానికులు, ప్రజలు భారీగా మార్కెట్‌కు తరలివచ్చారు. మార్కెట్లో ఏర్పాటు చేసుకున్న కూరగాయల దుకాణాలతో సహా నాలలో పడిపోవడంతో పలువురికి గాయాలయ్యాయి. పెద్ద నాల కుంగిపోయింది.
https://www.facebook.com/khanreport/videos/560586502182740
ఈ ఘటనలో నాలపై ఉన్న కార్లు, ఆటోలు, ద్విచక్ర వాహనాలు ధ్వంసమయ్యాయి. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. పెద్దఎతున్న మార్కెట్‌కు వచ్చిన జనాలను తరలించారు. ఈ ఘటనతో భయాందోళనకు గురైన స్థానికులు… ఎప్పుడు ఏమి కూలుతాయో అనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే నాల కుంగడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. కుంగిపోయిన నాలా మొత్తం రోడ్డు పొడవు 500 అడుగులు, పది అడుగుల వెడల్పుతో కూలినట్లు తెలిస్తుంది. కిందకు చూస్తే కళ్లు బైర్లుగమ్మేలా 12 అడుగుల మేర కుంగినట్లు స్థానికులు చెబుతున్నారు. మరోవైపు ఘటన గురించి తెలియగానే స్పాట్‌కు చేరుకున్న ఎమ్మెల్యే రాజాసింగ్‌.. పరిస్థితిని సమీక్షించారు. స్థానికులతో మాట్లాడారు.