క్రిస్మస్ జీవితాల్లో వెలుగులు నింపాలి

తాండూరు రాజకీయం వికారాబాద్

క్రిస్మస్ జీవితాల్లో వెలుగులు నింపాలి
– తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి
– ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే
తాండూరు, దర్శిని ప్రతినిధి: క్రిస్మస్ పండగ పేదల జీవితాలలో వెలుగులు నింపాలని తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఆకాంక్షించారు. క్రిస్మస్ పండగ సందర్భంగా శనివారం ఓ ప్రకటనలో తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి నియోజకవర్గ ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాండూరులో క్రిస్టియన్ భవనం నిర్మాణం కోసం రూ.కోటి, నియోజకవర్గంలోని అన్ని చర్చీల అభివృద్ధి కోసం రూ.5 కోట్లు ఇప్పటికే మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. తాండూరు అభివృద్ధి బీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమని చెప్పారు. ఏసు ప్రభు మార్గాన్ని అనుసరించే ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగు నిండాలని ఆకాంక్షించారు. క్రిస్మస్ పండగను తాండూరు నియోజకవర్గంలోని క్రైస్తవులు సంతోషంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు.