అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం..!

తాండూరు రాజకీయం వికారాబాద్

అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం..!
– తాండూరు మార్కెట్ కమిటి చైర్మన్ పట్లోళ్ల బాల్‌రెడ్డి
– మున్సిపల్‌లో సీసీ డ్రైన్‌ పనులు ప్రారంభం
తాండూరు, దర్శిని ప్రతినిధి : ప్రజలకు అవసరమైన అభివృద్ధిని అందించడమే ప్రభుత్వ ధ్యేయమని తాండూరు మార్కెట్‌ కమిటి చైర్మన్ పట్లోళ్ల బాల్‌రెడ్డి అన్నారు. శుక్రవారం తాండూరు పట్టణం 11వ వార్డులోని ఆదర్శనగర్‌లో డీఎంఎఫ్టీ ద్వారా రూ. 5లక్షలతో నిర్మిస్తున్న సీసీ డ్రైన్‌ పనులను బాల్‌రెడ్డి మున్సిపల్‌ కౌన్సిలర్లు పట్లోళ్ల నీరజాబాల్‌రెడ్డి, సోమశేఖర్లతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందని అన్నారు.

తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సహాకారంతో పట్టణంలోని అన్ని వార్డుల్లో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని అన్నారు. ప్రతి వార్డులో సీసీ రోడ్లు, మురుగు కాలువల నిర్మాణం జరుగుతుందని తెలిపారు. అభివృద్ధికి నిధులు కేటాయించి సమస్యలు పరిష్కరించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. అదేవిధంగా కౌన్సిలర్ నీరజాబాల్‌రెడ్డి మాట్లాడుతూ వార్డుల్లో అభివృద్ధి పనులు చేపట్టడం పట్ల ఎమ్మెల్యేకు, ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో యూత్‌ కాంగ్రెస్ తాండూరు పట్టణ అధ్యక్షులు బంటు వేణుగోపాల్, వార్డు పెద్దలు, కాంట్రాక్టర్ తదితరులు ఉన్నారు.

ఇదికూడా చదవండి…

సైన్స్ టాలెంట్ టెస్టులో విద్యార్థుల సత్తా