మన్నించవా.. మనోళ్ల సినిమా..!

తాండూరు రంగారెడ్డి వికారాబాద్ సినిమా

మన్నించవా.. మనోళ్ల సినిమా..!
– రండి చూసి ఆదరించండి
– నిర్మాత మంజుల, డైరెక్టర్ రమేష్ గౌడ్
తాండూరు, దర్శిని ప్రతినిధి : సినిమాపై ఉన్న అభిరుచితో మన ప్రాంతం నుంచి సినీరంగంలో రాణిస్తూ మన్నించవా అనే మంచి చిత్రాన్ని రూపొందించామని చిత్ర నిర్మాత మంజుల, మరో నిర్మాత, డైరెక్టర్ రమేష్ గౌడ్ తెలిపారు. బుధవారం తాండూరులో వారు మీడియాతో మాట్లాడారు. మంజుల తమది వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం జనగమా ప్రాంతమని, డైరెక్టర్ రమేష్ గౌడ్ ది ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలమని చెప్పుకొచ్చారు. మంజుల మాట్లాడుతూ 2014 నుంచి 2018 వరకు పలు షార్ట్ ఫిలింలను నిర్మాతగా రూపొందించడం జరిగిందని తెలిపారు. కార్తీకదీపం, బంధం, వదినమ్మ తదితర సీరియల్స్లో ఎస్ఐ, డాక్టర్ వంటి పాత్రలు చేయడం జరిగిందన్నారు. సినిమాలపై ఆసక్తి ఉండడంతో అందరు కొత్త వాళ్లతో మన్నించవా చిత్రాన్ని నిర్మాతగా నిర్మించడం జరిగిందని తెలిపారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి నిర్మాతగా, రమేష్ గౌడ్ డైరెక్టర్ శివమ్ మల్హోత్ర, అనుశ్రీలను హీరో హీరోయిన్లుగా సినిమాను తీయడం జరిగిందన్నారు. గతనెల విడుదల చేసినా.. మన ప్రాంతం వాళ్లకు చూపించాలనే ఉద్దేశంతో ఈనెల 30న తాండూరు పట్టణంలోని శాంత్ మహాల్ థియేటర్ లో సినిమాను విడుదల చేస్తున్నామని పేర్కొన్నారు. మన ప్రాంత ప్రజలు, అభిమానులు చిత్రాన్ని చూసి ఆదరించాలని విజ్ఞప్తి చేశారు. వారం రోజుల పాటు ప్రతిరోజూ 4 ఆటలతో చిత్రం ప్రదర్శించబడుతుందని వివరించారు. మన ప్రాంత వాసుల అభిరుచిని గౌరవించి ఉత్సహాం నింపాలని.. మన్నించవా చిత్రాన్ని ఆదరించాలని కోరారు.