శివాజీ మహారాజ్ బయలెల్లినాడో..!

తాండూరు రాజకీయం వికారాబాద్

శివాజీ మహారాజ్ బయలెల్లినాడో..!
– అంబరాన్నంటిన శివాజీ జయంతి ఉత్సవాలు
– పురవీదుల్లో శోభాయామానంగా శోభాయాత్ర
– పాల్గొన్న తాండూరు ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే
తాండూరు, దర్శిని ప్రతినిధి : చత్రపతి శివాజీ జయంతి వేడుకలను తాండూరులో అంబరాన్నంటే విధంగా జరుపుకున్నారు. సోమవారం హిందూ ఉత్సవ సమితి, విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్, జనచైతన్య సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలు ఘనంగా జరిగాయి. శివాజీ జయంతి సందర్భంగా ఆయా సంఘాల ఆధ్వర్యంలో పట్టణంలోని కాళీకాదేవి ఆలయం నుంచి భారీ శోభాయాత్ర చేపట్టారు. అక్కడి నుంచి ప్రారంభ మైన శోభాయాత్ర శాంతమహాల్ చౌరస్తా, వినాయక్ చౌక్, ఇందిరాచౌక్, మల్లప్ప మడిగ మీదుగా శివాజీ చౌరస్తా వరకు కొనసాగింది. ర్యాలీలో యువకులు శివాజీ మ హారాజ్కి జై.. జై శివాజీ.. జైజై శివాజీ అంటూ నినాదాలు చేశారు.

పురవీధుల్లో శోభాయాత్ర శోభాయామానంగా కొనసాగింది. శివాజీ చౌరస్తాలో విగ్రహానికి పలువురు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ ర్యాలీలో తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి పాల్గొన్నారు. అంతకుముందు దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యేతో పాటు ర్యాలీలో మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్, నాయకులు డాక్టర్ సంపత్ కుమార్, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ మురళీకృష్ణగౌడ్, మాజీ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల రత్నమాల నర్సింలు, కౌన్సిలర్లు ప్రబాకర్ గౌడ్, పట్లోళ్ల నీరజాబాల్ రెడ్డి, బోయఠవి, నాయకులు మాజీ డీపీసీ సభ్యులు పట్లోళ్ల నర్సింలు, సాయిపూర్ బాల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి వెంట మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల  దీపా నర్సింలు, మాజీ లైబ్రరీ చైర్మన్ రాజుగౌడ్, బీఆర్ఎస్ నాయకులు పట్లోళ్ల నర్సింలు, శ్రీనివాస్ చారి, మార్కెట్ కమిటి మాజీ వైస్ చైర్మన్ వెంకట్ రెడ్డి. హిందూ ఉత్సవ సమితి, భజరంగ్ దళ్, విహెచ్పీ, యువజన సంఘాల ప్రతినిధులు, రాజకీయ ప్రముఖులు, తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి…

సార్లు వస్తున్నారు..!