కంటి వెలుగు పేదలకు వరం

ఆరోగ్యం తాండూరు రాజకీయం వికారాబాద్

కంటి వెలుగు పేదలకు వరం
– కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి
– వార్డుల్లో వైద్య శిబిరాల ఏర్పాటుకు సహకరించాలి
– మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్
తాండూరు, దర్శిని ప్రతినిధి : కంటి సమస్యలతో బాధపడే వారిని ఆదుకునేందుకు తెలంగాణ సర్కారు వరంగా కంటి వెలుగు-2ను చేపట్టబోతుందని, ఇందులో అందరు భాగస్వాములై విజయవంతం చేయాలని తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ అన్నారు. శుక్రవారం తాండూరు మున్సిపల్ సమావేశ మందిరంలో చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ అధ్యక్షత వైద్య శాఖ అధికారులు, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, ఆర్పీలతో కంటి వెలుగుపై అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్ పర్సన్ మాట్లాడుతూ కంటి చూపుతో, వివిధ సమస్యలతో బాధపడే వారికోసం తెలంగాణ సర్కారు కంటి వెలుగును ప్రవేశ పెట్టిందన్నారు. మొదటి దశ విజయవంతం కావడంతో కంటి వెలుగు-2ను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతుందన్నారు. ఈనెల 18 నుంచి ప్రారంభమయ్యే కంటి వెలుగును విజయవంతం చేసేలా అందరు కృషి చె యాలన్నారు. వార్డుల్లో నిర్వహించే కంటి వైద్య శిబిరాల ఏర్పాటు కోసం అందరు తోడ్పాటు అందించాలన్నారు. వార్డుల వారిగా నిర్వహించే బృందాలకు అందరు సహకరించాలన్నారు. స్థలాలను గుర్తించి అందజేయాలన్నారు. వైద్యాధికారి డా. సౌమ్యరాణి మాట్లాడుతూ వంద రోజుల పాటు నిర్వహించే కంటి వెలుగు-2 కార్యక్రమంలో 8 బృందాలు పాల్గొంటాయని చెప్పారు. కంటి చూపుతో బాధపడే వారి వివరాలను గుర్తించి అందించాలన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు బాధితులకు మెరుగైన సేవలను అందిస్తామని అన్నారు. ప్రభుత్వమే బాధితులకు ఉచితంగా అద్దాలను అందిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ నరేందర్ రెడ్డి, మాజీ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల రత్నమాల నర్సింలు, ఫ్లోర్ లీడర్లు బొబ్బిలి శోభారాణి, పాంబూరు సోమశేఖర్ వరాల శ్రీనివాస్ రెడ్డి, అంతారం లలిత, కౌన్సిలర్లు పట్లోళ్ల నీరజాబాల్ రెడ్డి, అబ్దుల్ రజాక్, ప్రభాకర్ గౌడ్, బోయరవి, వెంకన్న గౌడ్, బొంబీనా, మమత, మధుబాల, బాలప్ప, కోఆప్షన్ సభ్యురాలు సారంగా విజయ్, ఏఈ ఖాజా హుస్సేన్, జూనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్, ఆర్పీలు తదితరులు పాల్గొన్నారు.