పాపాత్మున్ని ప‌ట్టుకున్న పోలీసులు

క్రైం తాండూరు తెలంగాణ వికారాబాద్

పాపాత్మున్ని ప‌ట్టుకున్న పోలీసులు
– నాయిన‌మ్మ‌ను త‌న్నినందుకు అరెస్టు
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: ఫించ‌న్ డ‌బ్బుల కోసం నాయినమ్మ‌ను కాలుతో త‌న్ని పాపాత్ముడైన మ‌నుమ‌డిని పోలీసులు ప‌ట్టుకుని అరెస్టు చేశారు. వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండ‌లం మంబాపూర్ గ్రామంలో చింది య‌శోద‌మ్మ అనే వృద్ధురాలును అమె మ‌నుమ‌డు గోవ‌ర్ద‌న్ ఫించ‌న్ డబ్బులు ఇవ్వాల‌ని చావ‌బాదాడు. కాలుతో త‌న్నుతూ అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించారు. గ‌త రెండు రోజుల క్రితం జ‌రిగిన ఈ సంఘ‌ట‌న శుక్ర‌వారం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయిన విష‌యం తెలిసిందే. ఈ సంఘ‌ట‌న‌పై తాండూరు డీఎస్పీ శేఖ‌ర్ గౌడ్ విచారం వ్య‌క్తం చేశారు. వెంట‌నే మ‌నుమ‌డిపై చ‌ర్య‌లు తీసుకునేందుకు సిద్ద‌మ‌య్యారు. పెద్దేముల్ మండ‌ల ఎస్ఐ అబ్దుల్ రవూఫ్‌కు వెంట‌నే గోవ‌ర్ద‌న్‌ను అరెస్టు చేయాల‌ని ఆదేశాలు జారీ చేశారు. శుక్ర‌వారం ఉద‌యం నుంచే గోవ‌ర్ద‌న్ ప‌రారిలోకి వెళ్లిపోయాడు. ఎస్ఐ అబ్దుల్ ర‌వూఫ్ అండ్ టీం ఎట్ట‌కేల‌కు గోవ‌ర్ద‌న్‌ను ప‌ట్టుకుని పోలీస్టేష‌న్‌కు త‌ర‌లించారు. డీఎస్పీ శేఖ‌ర్ గౌడ్ ఆదేశాల‌తో గోవ‌ర్ద‌న్‌ను అరెస్టు చేశారు. ఉద‌యం నుంచి సోష‌ల్ మీడియాలో వీడియో వైర‌ల్ కావ‌డంతో అంద‌రు గోవ‌ర్ద‌న్‌ను తిట్టిపోశారు. త‌ల్లి, తండ్రి లేని మ‌నుమనుల‌కు సేవ చేస్తున్న నాయిన‌మ్మ‌పై దాడి చేసిన మూర్ఖుడిని శిక్షించాల‌ని ప‌లువురు ఎత్తిచూపారు. మృగంలా వ్య‌వ‌హ‌రించిన గోవ‌ర్ద‌న్ వైఖ‌రి వ‌ల్ల అత‌ని భార్య కూడ వ‌దిలేసి వెళ్లిన‌ట్లు గ్రామ‌స్తులు గుస‌గుస‌లాడుతున్నారు.