పారదర్శకంగా పదోన్నతులు, బదిలీలు
– ఉమ్మడి జిల్లాలో 10 వేల మందికి చాన్స్
– బండి సంజయ్ ఆరోపణలు అర్థరహితం
– విద్యాశాఖ మంత్రి పట్లోళ్ల సబితా ఇంద్రారెడ్డి
– తాండూరు వర్గపోరుపై మంత్రి ఆసక్తికర వాఖ్యలు
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి: తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో చేపడుతున్న ఉపాధ్యాయుల పదోన్నతులలో పారదర్శకతను పాటిస్తున్నామని, ఉమ్మడి జిల్లాలో తొలి విడతలతో 10 మందికి ప్రమోషన్లు కల్పిస్తున్నామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పట్లోళ్ల సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మంగళవారం వికారాబాద్ జిల్లా తాండూరు. నియోజకవర్గంలోని పుట్టిన ఊరు కోటబాస్పల్లిలో తమ్ముడు నర్సింహారెడ్డి నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి సబితారెడ్డి హాజరయ్యారు.

ఈ సందర్భంగా మంత్రి సబితా రెడ్డి మీడియాతో మాట్లాడారు తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు పారదర్శంగా టీచర్ల బదిలీ, ప్రమోషన్ల ప్రక్రియ జరుగుతోందన్నారు. ఆన్ లైన్ ద్వారా ఓపెన్ గా చేపట్టడం జరుగుతుందన్నారు. ఉమ్మడి జిల్లాలో 26వేల మంది ఉపాధ్యాయుల పదోన్నతులు ఉండగా తొలి విడతలో 10 మందికి చాన్స్ ఇస్తున్నట్లు వివరించారు. టీచర్ల బదిలీ, ప్రమోషన్ల విషయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని అన్నారు. ఆయన ఆరోపణలు అర్ధరహితమన్నారు. ఆయన కుమారుడుపై యూనివర్సిటీ నిబంధనల ప్రకారమే కేసు నమోదు చేయడం జరిగిందన్నారు. కుమారున్ని మందలించాల్సింది పోయి సీఎం కేసీఆర్ ను విమర్శించడమే పనిగా పెట్టుకోవడం మంచి పద్ధతి కాదన్నారు. అదేవిధంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు – మన బడిలో 9వేల బడులను ఎంపిక చేయగా ఇప్పటి వరకు 1200 పాఠశాలలు పనులు పూర్తి చేయడం జరిగిందని, త్వరలోనే ప్రారంభానికి చర్యలు తీసుకుంటామని అన్నారు. మరోవైపు ఎంపీగా పోటీ చేసే ఆలోచన లేదని, మళ్లీ మహేశ్వరం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయడం ఖాయమని స్పష్టం చేశారు. తాండూరు రాజకీయాలలో ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే వర్గపోరులో వాళ్లే సరిదిద్దుకుంటారని, రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ కోసం ఇద్దరు పనిచేయొచ్చని అన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేల టిక్కెట్ విషయం తన పరిధిలో లేదని, సీఎం కేసీఆర్ తుది నిర్ణయం తీసుకుంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ మాజీ చైర్మన్ లక్ష్మారెడ్డి, మాజీ జెడ్పీటీసీ మాధవ రెడ్డి, నాయకులు డాక్టర్ సంపత్ కుమార్, పట్లోళ్ల నర్సింలు, శ్రీనివాసాచారి. బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు అప్పూ(సయూం), మండల అధ్యక్షులు జీ. రాందాస్ తదితరులు పాల్గొన్నారు.

