కార్మికుల సంక్షేమానికి కట్టుబడిన సర్కారు
-ఎమ్మెల్యే సహాకారంతో ఆటో డ్రైవర్లకు రూ. 10 లక్షల బీమా
– ఉద్యోగ, కార్మిక సన్మాన సమ్మేళనంలో బీఆర్ఎస్ నేతలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : మేడే స్పూర్తితో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తాండూరు బీఆర్ ఎస్ నేతలు పేర్కొన్నారు. సోమవారం కార్మిక దినోత్సవం సందర్భంగా తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఆదేశాలతో బీఆర్ఎస్ కార్మిక విభాగం ఆధ్వర్యంలో పట్టణంలోని రైతు బజార్ లో మేడే వేడుకలతో పాటు ఉద్యోగ, కార్మిక సన్మాన సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వికారాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజుగౌడ్, సీనియర్ కార్మిక నాయకులు విజయ్ కుమార్, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు అప్పూ(నయూం), నాయకులు తదితరులు హాజరయ్యారు. వారి సమక్షంలో నియోజకవర్గ అధ్యక్షులు కె.గోపాల్ కార్మిక జెండా ఆవి ష్కరించారు.
ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం కార్మికుల సంక్షేమానికి కట్టుబడి ఉందని పేర్కొన్నారు. త్వరలోనే కార్మికులకు ఈఎస్ఐ ఆసుపత్రిని అందుబాటులోకి తీసుకవచ్చేందుకు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి కృషి చేస్తున్నారని అన్నారు. అనంతరం ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి సహాకారంతో ఆటో డ్రైవర్ల కోసం ప్రవేశ పెట్టిన రూ.10 లక్షల బీమా పథకాన్ని నేతలు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ కౌన్సిలర్ సంగీత ఠాకూర్, నాయకులు నరేందర్ గౌడ్, పట్టణ ప్రధాన కార్యదర్శి సంతోష్ గౌడ్, అంగన్వాడి, ఆశ, మహిళ సంఘాల ప్రతినిధులు, హమాలి, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, కార్మికులు, కార్మిక సంఘాల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

