ఎలక్ట్రిషన్ల సంక్షేమానికి దృష్టిసారించాలి

క్రైం తాండూరు రాజకీయం వికారాబాద్

ఎలక్ట్రిషన్ల సంక్షేమానికి దృష్టిసారించాలి
– తాండూరులో ఎలక్ట్రిషన్ల దినోత్సవం
తాండూరు, దర్శిని ప్రతినిధి: ప్రాణాలను పణంగా పెట్టి పనిచేసే ఎలక్ట్రిషన్ల సంక్షేమానికి ప్రభుత్వాలు దృష్టిసారించాలని తాండూరు ప్రైవేటు ఎలక్ట్రికల్ టెక్నిషియన్స్ ఫెడరేషన్ అధ్యక్షులు నసీర్ అన్నారు. విద్యుత్ బల్బును కనిపెట్టిన థామల్ అల్వా ఎడిసన్ 1880 జనవరి 27న దానిపై పేటెంట్ రైట్స్ పొందిన సందర్భంగా ప్రతి యేడాది ఎలక్ట్రిషన్ దినోత్సవం జరుపుకుంటారు. ఇందులో భాగంగా శుక్రవారం తాండూరు ప్రైవేటు ఎలక్ట్రికల్ టెక్నిషియన్స్ ఫెడరేషన్ అధ్యక్షులు నసీర్ ఆధ్వర్యంలో ఎలక్ట్రిషన్స్ డే జరుపుకున్నారు. తాండూరులోని కార్యాలయం ముందు జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఎలక్ట్రిషన్లు ప్రతి రోజూ ప్రాణాలను పణంగా పెట్టి పనులు చేపడుతారని అన్నారు. వారి సంక్షేమానికి ప్రభుత్వాలు దృష్టిసారించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ కార్యవర్గ సభ్యులు నందు, నగేష్. వాహిద్, బషీర్ తదితరులు పాల్గొన్నారు.