బీవీజీ ఫౌండేషన్ గొప్ప మనసు..!
– జీవన్గీలో వరద బాధితులకు నిత్యవసర సరుకులు
– డాక్టర్ సంపత్ కుమార్ కి కృతజ్ఞతలు
బషీరాబాద్, దర్శిని ప్రతినిధి : సమాజంలో పేదల కోసం చేయూతను అందించే బీవీజీ ఫౌండేషన్ తన గొప్ప మనసును చాటుకుంది. బషీరాబాద్ మండలం జీవన్గి గ్రామంలో ఎస్సీ కాలనీ వరద బాధితులను ఆదుకునేందుకు నిత్యావసర సరుకుల కిట్లను పంపిణీ చేసింది.

బుధవారం బషీరాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మాధవరెడ్డి, ఏఎంసి మాజీ వైస్ చైర్మన్ మాణిక్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, సునీల్ ప్రసాద్, రత్నప్పలు ఫౌండేషన్ తరుపున బాధితుకలు పంపిణీ చేశారు. బియ్యం, పప్పు, వంట నూనె తదితర సరుకులతో కూడిన కిట్లను ఇవ్వడంతో వరద బాధితులు సంతోషం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా మాధవరెడ్డి మాట్లాడుతూ.. బివిజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలోఇలాంటి సామాజిక సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయమన్నారు. ఎక్కడ ఏ ఆపద ఉన్నా అక్కడ బివిజీ ఫౌండేషన్ సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయన్నారు. ఎవరూ కూడా దిగులు చెందాల్సిన అవసరం లేదని అన్నారు. జీవన్గి గ్రామ ప్రజల తరఫున ఆయన బివిజీ ఫౌండేషన్ నిర్వాహకులు డా.సంపత్ కుమార్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువకుల, ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

