నాలుకను కొరికేసి.. కోసేసింది
– భర్తపై భార్య ధారుణ ప్రకోపం
– కేసు నమోదు చేసిన పోలీసులు
– వైరల్‌గా మారిన సంఘటన
దర్శని డెస్క్: భర్తపై ఓ ప్రకోపాన్ని ప్రదర్శించింది. నోటితో భర్త నాలుకను కొరికేసి.. దానిని మళ్లీ కేసేంది. ఈ షాకింగ్ ఘటన.. ఉత్తర్‌ప్రదేశ్‌లోని లక్నో జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు వెల్లడించిన వివరాల్లోకి వెళితే… లక్నో జిల్లాకు చెందిన మున్నా ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అతనికి మూడేళ్ల క్రితం సల్మా అనే మహిళతో వివాహాము జరిగింది. కొన్నాళ్లుగా భార్య, భర్తల మద్య విభేదాలు తలెత్తాయి. దీంతో సల్మా బిడ్డతో కలిసి ఏడాది కాలంగా విడివిడిగా ఉంటోంది. అయితే శుక్రవారం మున్నా మద్యం తాగి.. లక్నోలోని ఠాకూర్‌గంజ్ రాధాగ్రామ్ ప్రాంతంలోని భార్య ఇంటికి వెళ్లాడు. ఈ క్రమంలో తమ బిడ్డను కలవడానికి వీల్లేదంటూ సల్మా మున్నాతో గొడవకు దిగింది. ఈ క్రమంలో కోపోద్రిక్తురాలైన భార్య.. భర్త నాలుకను నోటితో కొరికింది. దీంతో తీవ్రంగా గాయపడిన మున్నా స్పృహ తప్పి పోయాడు. తీవ్ర రక్తస్రావమైంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బాధితుడిని కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్శిటీ ట్రామా సెంటర్‌కు తరలించారు. మహిళను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. అదికాస్త వైరల్‌గా మారింది.

