మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర
– కేసును చేధించిన పోలీసులు
హైదారాబాద్, దర్శిని ప్రతినిధి : తెలంగాణమంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కొందరు కుట్ర పన్నారు. విషయం తెలిసిన పోలీసు కుట్ర గుట్టును రట్టు చేశారు. మహబబ్ గర్‌కు చెందిన కొందరు సుపారీ గ్యాంగ్‌తో మంత్రి శ్రీనివాస్ గౌడ్‌తో పాటు ఆయన సోదరుడు శ్రీకాంత్ గౌడ్ ను హత్య చేయించేందుకు పథకం రచించారు. ఇందుకు ఫరూక్ అనే వ్యక్తికి సుపారీ ఇచ్చేందుకు యత్నించినట్లు తెలిసింది. ఈమేరకు ఫరూక్ పేట్ బషీరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మంత్రి హత్యకు కుట్ర పన్నిన విషయం వెలుగులోకి వచ్చింది. మొత్తం రూ. 12 కోట్లకు డీల్ కుదిరినట్లు సమాచారం. అయితే ఈ ఘటనకు సంబంధించి పోలీసులు పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. దీనిపై పోలీసులు మీడియాకు వివరాలు వెల్లడించే అవకాశం ఉంది.


