కులాలు, మతాల పేరుతో దూషణలకు దిగితే..!

క్రైం తాండూరు రాజకీయం వికారాబాద్

కులాలు, మతాల పేరుతో దూషణలకు దిగితే..!
– ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదు
– జిల్లా ప్రజలకు ఎస్పీ కోటిరెడ్డి వార్నింగ్
వికారాబాద్‌, దర్శిని ప్రతినిధి: కులాలు, మతాల పేరుతో దూషణలకు దిగితే సహించేది లేదని.. ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని వికారాబాద్ జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి జిల్లా ప్రజలకు హెచ్చరించారు. ఇటీవల కాలనంలో దేవుళ్లు, కుల.. మతాలతో పేరుతో అనుచిత వాఖ్యల వల్ల శాంతి భద్రతలకు ఇబ్బందులు ఏర్పడుతున్న నేపథ్యంలో గురువారం జిల్లా ఎస్పీ కోటిరెడ్డి ఓ ప్రకటనలో అందరికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. జిల్లా లో ఎవరైనా కులాల, మతాల పేరుతో శాంతిభద్రతలకు ఆటంకం కలిగే విధంగా మాట్లాడిన, సోషల్ మీడియా లలో పోస్ట్ లు చేసినా ఊరుకునేది లేదన్నారు. జిల్లాలో ప్రజా శాంతికి భంగం కలిగే విధంగా ప్రవర్తించిన ఉపేక్షించేది లేదని.. ఎంతటి వారిపైన అయినా చట్ట ప్రకారం కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు. ప్రజలందరూ తమ కుల, మతాలను ను గౌరవించుకొనే విధంగానే ఇతరుల కుల మతాలను కూడా గౌరవించాలని సూచించారు. జిల్లాలో ఏదైనా అవాంఛనీయమైన సంఘటనలు జరిగినప్పుడు చట్టాన్ని ఎవ్వరూ కూడా అతిక్రమించకుండా, భౌతిక దాడులకు పాల్పడకుండా పోలీస్ అధికారులకు సమాచారాన్ని అందించాలన్నారు. ఆవేశంలో చట్టాన్ని తమ చేతులలోకి తీసుకున్నా.. భౌతిక దాడులకు పాల్పడినా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. పోలీస్ శాఖ అధికారులు ఇట్టి విషయాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రజలు పోలీస్ అధికారులకు సహకరించాలన్నారు. ఏదైనా చిన్న చిన్న సంఘటనలు జరిగితే సంబందిత పోలీస్ అధికారులకు లేదా డయల్ 100 కి గాని సమాచారం అందించాలని సూచించారు.