కాగ్నా బ్రిడ్జికి ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య
– మృతుడు కర్ణాటక వాసిగా గుర్తింపు
– సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు – కోడంగల్ రోడ్డు మార్గంలో ఉన్న కాగ్నా బిడ్జికి ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బుధవారం ఉదయం ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. యాలాల పోలీసుల ప్రాథమిక విచారణలో మృతుడు కర్ణాటక వాసిగా గుర్తించారు.

పోలీసుల కథనం మేరకు కర్ణాటక రాష్ట్రం అంపల్లి గ్రామానికి చెందిన నగేష్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. తాండూరు పట్టణం ఇందిరానగర్‌లో భార్య స్వప్న, ఇద్దరు పిల్లలతో కలిసి అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నాడు. అయితే బుధవారం ఉదయం తాండూరు పట్టణ సమీపంలోని కాగ్నా కొత్త బ్రిడ్జికి ఉరేసుకుని కనిపించాడు. గమనించిన స్థానికులు యాలాల పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ అరవింద్ కుమార్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుని వద్ద తల్లి ఫోన్ నెంబర్ రాసిన చీటీ లభ్యమయ్యింది. కాగా మృతుని ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదని పోలీసులు వెల్లడించారు. బ్రిడ్జికి వేలాడిన మృతదేహాన్ని పోలీసులు కిందకు దించి పోస్టు మార్టం నిమిత్తం తాండూరులోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి మార్చురికి తరలించారు.
ఇది కూడా చదవండి…

