అట్టహాసంగా ప్రభాకర్‌ గౌడ్ జన్మదినం

తాండూరు రాజకీయం వికారాబాద్

అట్టహాసంగా ప్రభాకర్‌ గౌడ్ జన్మదినం
– శుభకాంక్షలు తెలిపిన నేతలు, కార్యకర్తలు
– పార్టీ కార్యాలయంలో గజమాలతో సన్మానం
తాండూరు, దర్శిని ప్రతినిధి: కాంగ్రెస్ పార్టీ తాండూరు పట్టణ అధ్యక్షులు, 25వ వార్డు మున్సిపల్ కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్ జన్మదిన వేడుకలు అట్టహాసంగా జరిగాయి. సోమవారం పట్టణ పార్టీ కార్యాలయంలో నేతలు, అభిమానుల సమక్షంలో ప్రభాకర్ గౌడ్ తన జన్మదిన వేడుకలను జరుపుకున్నారు.

ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చి ప్రభాకర్‌ గౌడ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా ప్రభాకర్‌ గౌడ్‌ను భారీ గజమాలతో సత్కరించారు. శాలువాలతో సన్మానించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ప్రజా నాయకుడు ప్రభాకర్‌ గౌడ్ ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. అనంతరం ప్రభాకర్ గౌడ్ మాట్లాడుతూ తనకు శుభాకాంక్షలు తెలిపిన వారందరికి అభినందనలు తెలిపారు. అందరి ప్రేమాభిమానాలతో పార్టీ పటిష్ఠతకు కృషి చేస్తానని అన్నారు.

ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ నాయకులు హేమంత్ కుమార్, యూత్ కాంగ్రెస్ తాండూరు కార్యదర్శి కావలి సంతోష్ కుమార్, నాయకులు నవాజ్, నారా అశోక్, నర్సింలు, ఖయ్యూం, మున్సిపల్ ఫ్లోర్ లీడర్లు వరాల శ్రీనివాస్ రెడ్డి, సోమశేఖర్, నేతలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.